ఒకే వేదికపై పలు అవార్డులు, పురస్కారాలతో సత్కరించేందుకు ఉగాది పండగ కారణం కానుంది. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే 8వ తేదీన చెన్నైలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కు ‘బాపు రమణ’ పురస్కారం, సీనియర్ నటి ఆమనికి ‘బాపు బొమ్మ’ పురస్కారం అందజేయనున్నారు. ఇక ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కుల కమిషన చైర్మన్ జస్టిస్ టి.మీనాకుమారికి, ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వనిత దాట్లకు ‘మహిళా రత్న’ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
సినీరంగానికి చెందిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతికవర్గ నిపుణులకు పురస్కారాలు అందజేయనున్నారు. వాటి వివరాలు...
ఉత్తమ నటుడు - ఎన్టీఆర్ (టెంపర్)
ఉత్తమ నటి - అనుష్క (రుద్రమదేవి)
ఉత్తమ ప్రతినాయకుడు - దగ్గుపాటి రానా (బాహుబలి)
స్పెషల్ జ్యూరి అవార్డ్స్ - నిత్యామీనన్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
శర్వానంద్ - (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
శివాజీ రాజా - (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటుడు - పోసాని కృష్ణమురళి(టెంపర్)
ఉత్తమ సహాయ నటి - హేమ (కుమారి 21 ఎఫ్)
ఉత్తమ హాస్యనటుడు - పృథ్వి (శంకరాభరణం)
ఉత్తమ నూతన నటుడు - అక్కినేని అఖిల్ (అఖిల్)
ఉత్తమ నూతన నటి - ప్రజ్ఞ జైస్వాల్ (కంచె)
ఉత్తమ చిత్రం - శ్రీమంతుడు (మైత్రి మూవీ మేకర్స్)
ఉత్తమ సంచలనాత్మక చిత్రం - బాహుబలి (శోభు యార్లగడ్డ)
ఉత్తమ కథ - జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్)(కంచె)
ఉత్తమ కళా దర్శకుడు - ‘పద్మశ్రీ’ తోట తరణి (రుద్రమదేవి)
ఉత్తమ కథనం - క్రాంతి మాధవ్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
ఉత్తమ దర్శకుడు - కొరటాల శివ (శ్రీమంతుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీప్రసాద్ (s/0 సత్యమూర్తి, శ్రీమంతుడు)
ఉత్తమ ఛాయాగ్రహకుడు - సెంథిల్ కుమార్ (బాహుబలి)
ఉత్తమ మాటల రచయిత - సాయిమాధవ్ బుర్రా (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె,
గోపాల... గోపాల, దొంగాట)
ఉత్తమ పాటల రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి (రుద్రమదేవి)
ఉత్తమ గాయకుడు సాగర్ - (s/0 సత్యమూర్తి, శ్రీమంతుడు)
ఉత్తమ గాయని - రమ్య బెహరా (బాహుబలి)
ఉత్తమ నూతన దర్శకుడు - వంశీకృష్ణ (దొంగాట)
ఉత్తమ బాల నటి - జ్వాల మేఘన (గోపాల... గోపాల)
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more