సింహ, లెజెండ్, లయన్, డిక్టేటర్ వంటి వరుస హిట్ చిత్రాలతో ఇప్పటికీ 99 చిత్రాలను పూర్తిచేసుకున్న తెలుగు అగ్ర స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రాన్ని ఈరోజు ఉగాది పండగ సంధర్భంగా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో అభిమానుల సమక్షంలో జరిపారు.
ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలయ్య 100వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ... 99 చిత్రాల తర్వాత చేయబోయే 100వ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలను అందుకోవాలంటే సరైన కథతో సినిమా తీయాలి. చాలా కథలు విన్నాను. కొన్ని నచ్చినప్పటికీ.. సరిగ్గా కుదర్లేదు. ఎట్టకేలకు ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథ కుదిరింది అని అన్నారు.
అలాగే గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని తన తండ్రి నవరస నటన సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెరకెక్కించాలని భావించారని... కానీ అది సాధ్యపడలేదన్నారు. ఈ సినిమా చేయడం దైవ నిర్ణయం అని చెప్పారు. తెలుగు వారు తెలుసుకోవాల్సిన చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి అని బాలకృష్ణ పేర్కొన్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి నవరసాలు ఉండే చిత్రం అవుతుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ లోగోను విడుదల చేసారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more