Ouch! Kristen Bell Slaps a Male Reporter on Red Carpet

Kristen bell slaps rude reporter in the face

Kristen Bell, overzealous journalist, red carpet, Actress Kristen Bell, latest film, reporter, premiere, The Boss, slap, Hollywood, Celebrity,

Kristen Bell took matters into her own hands when she was confronted by an overzealous journalist on the red carpet of her latest film.

రిపోర్టర్ చెంప చెల్లుమనిపించిన నటిమణి

Posted: 04/10/2016 04:03 PM IST
Kristen bell slaps rude reporter in the face

ఈ మధ్యకాలంలో ఇక్కడ బాలీవుడ్ మొదలుకుని అక్కడ హాలీవుడ్ వరకు పలువురు నటీమణిను తమ హుందాతనాన్ని పక్కన బెట్టి తాము ఎదుర్కోన్న తిక్క ప్రశ్నలకు చెంపదెబ్బలతో బదులిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ తలతిక్క ప్రశ్నను అడిగటంతో పాటు నటి చేయి పట్టుకుని లాగిన మీడియా ప్రతినిధి చెంపను చెళ్లుమనిపించింది ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ బెల్.  అతడి ప్రవర్తనను చూసి చిర్రెత్తి పోయింది. ఓ ప్రముఖ వెబ్ సైట్ సేకరించిన వీడియో సమాచారం ప్రకారం ది బాస్ అనే చిత్రం ప్రీమియర్ కార్యక్రమానికి క్రిస్టెన్ బెల్ హాజరైంది.

అదే కార్యక్రమానికి వచ్చిన డొనెల్లీ అనే రిపోర్టర్ ఆమె రెడ్ కార్పెట్ పై ఉండగా ముఖానికి దగ్గరగా మైక్ పెట్టి ఇబ్బంది పెట్టేలా, ధ్వంధ్వార్ధం వచ్చేలా ప్రశ్నించాడు. ఈ చిత్రంలో బాస్ ఎవరు అని ప్రశ్నించడమే కాకుండా మరో ప్రశ్న కూడా అడిగాడు. అప్పటికే ఆమె ఆగ్రహతం కుతకుతలాడిపోయింది. అతడి నుంచి దూరంగా జరిగి వెళ్లిపోతుండగా ఒక్కసారిగా చేయిపట్టుకొని లాగేందుకు ప్రయత్నిస్తూ 'బేబీ' అంటూ పిలిచాడు. దీంతో ఇక కోపాన్ని ఆపుకోలేక గట్టిగా లాగిపెట్టి ఒక్కటిచ్చింది. అయితే, అతడు ఏం ప్రశ్న వేశాడనే విషయం మాత్రం చెప్పలేదు. అతడి ప్రవర్తనకు ఉలిక్కిపడిన ఆమె కొద్ది సేపటికే కార్యక్రమం కోసం లోపలికి వెళ్లిపోయారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Kristen Bell  reporter  premiere  The Boss  slap  

Other Articles