Oopiri | Thanks Meet | Nagarjuna | Karthi | Tamannah

Oopiri thanks meet

Oopiri Thanks Meet, Oopiri Thanks Meet stills, Oopiri Thanks Meet Gallery, Oopiri Collections, Oopiri movie, Oopiri usa collections, Oopiri movie records, Oopiri videos, Oopiri posters, Oopiri

Oopiri Thanks Meet: Akkineni Nagarjuna, Karthi, Tamannah acts in lead roles. Vamsi Paidipally director, PVP Producer.

హుషారుగా ‘ఊపిరి’ థ్యాంక్స్ మీట్

Posted: 04/14/2016 10:16 AM IST
Oopiri thanks meet

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో డా.దాసరి నారాయణరావు, నాగార్జున, అఖిల్, శ్రీమతి ఎ.నాగసుశీల, కోనవెంకట్, వంశీపైడిపల్లి, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, తమన్నా తదితరులు పాల్గొన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.... వంశీ నుండి ఊపిరి యూనిట్ కు థాంక్స్. ఒక ఆర్టిస్ట్ కు, డైరెక్టర్ కు మంచి ప్రొడ్యూసర్ అవసరం. మాకు పివిపి రూపంలో మంచి ప్రొడ్యూసర్ దొరికాడు. నాగచైతన్య సినిమా టైటిల్ సాహసమే శ్వాసగా సాగిపో అనే టైటిల్ నాకు ఎంతో ఇష్టం. నేను చాలా సంవత్సరాలుగా ఆ టైటిల్ లోని మీనింగ్ ను ఫాలో అవుతున్నాను. ఆ సాహసంతోనే గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, మాస్, అన్నమయ్య ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పటి వరకు వచ్చాను. సాహసమే శ్వాసగా సాగిపోలో శ్వాస అభిమానులు. వారే లేకుంటే ఇలాంటి సినిమాలు చేసేవాణ్ణి కాను. ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉంటాం. ఇదే సాహసంతో, కాన్ఫిడెంట్ తో తిరుపతి వెంటేశ్వరస్వామి దగ్గరకు కి వెళ్లి హథీరాంబాబాపై కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాను. ఈ రెండు నెలలు ఆ సినిమా కోసం రెడీ అవుతున్నాను. అంతే కాకుండా ఈ రెండు నెలల్లో కళ్యాణ్ కష్ణ, నాగచైతన్యతో ఓ సినిమా మొదలు పెట్టడం, వంశీని, అఖిల్ ను కూర్చోపెట్టి కథను ఫైనల్ చేయించడం కూడా ఈ రెండు నెలల్లో చేయించాలి. నేను ఇంత ముందు వరకు నా ఇద్దరబ్బాయిల మీద మనసు పెట్టలేదు. ఈ ఏడాది అదే పనిలో ఉంటాను. ఇదే నేను అక్కినేని అభిమానులకు ఇచ్చే ప్రామిస్ అన్నారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.... అక్కినేని అభిమానులంటే నా అభిమానులు. నా అభిమాన నటుడు నాగేశ్వరరావుగారు. ఊపిరి తెలుగు సినిమా పరిశ్రమకు నాగేశ్వరరావుగారు ఊపిరి. నాగేశ్వరరావుగారికి నాగార్జున ఊపిరి. నాగార్జునకి చైతు, అఖిల్ ఊపిరి. పదిహేను సంవత్సరాల క్రితం బొమ్మరిల్లు సినిమా చూశాను. దాని తర్వాత నేను ఇంత వరకు ఒక గొప్ప సినిమాను చూసుంటే అది కేవలం ఊపిరి మాత్రమే. మన తెలుగు వారు గొప్ప చిత్రం చేయగలరని నిరూపించిన చిత్రమిది. ఈ సినిమా తీయడానికి గట్స్ చూపించిన పివిపిని అభినందిస్తున్నాను. ఇదే టీంతో గొప్ప కమర్షియల్ సినిమా తీయవచ్చు. కానీ పివిపిగారు గొప్ప సినిమా తీశారు. ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్న నాగార్జునగారికి హ్యాట్సాఫ్. నాకు తెలిసి ఈ సినిమా చేయడానికి ఏ కమర్షియల్ హీరో ఒప్పుకోడు. ఒక ఆర్టిస్ట్ కు కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోపెట్టినందుకు వంశీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నాకు నాగార్జున కళ్లంటే ఇష్టం. నా మజ్ను సినిమా తర్వాత నాగార్జున కళ్లను ఎవరూ వాడుకోలేదు. కానీ ఇప్పుడు వంశీ వాడుకున్నాడు.కళ్లతో నటించడం అంటే సులభం కాదు. నటనలో పరిపక్వత వచ్చిన వారు మాత్రమే చేయగలరు. నేనైతే జ్యూరీలో ఉంటే నాగార్జున బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చేస్తాను. నిన్న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో ఎగిరి గంతేసి, ఈవాళ కుర్చీలో కూర్చుని పెర్ పార్మెన్స్ చేయడం అంత ఈజీకాదు. మనం సినిమాను అన్నపూర్ణ స్టూడియో తప్ప వేరేవరో చేయలేరు. తీసిన ఆడేది కాదు. ఎప్పుడు నాగార్జునగారు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇదంతా నాగేశ్వరరావుగారి నుండి వచ్చినదే. ఒక నటుడు వేయాల్సిన వైవిధ్యమైన పాత్రలన్నింటినీ ఆయన చేసేశారు. అదే వైవిధ్యమే నాగార్జునలో కనిపిస్తుంది. దర్శకుడు వంశీ నిజమైన హీరో. సినిమాను ఎంతో అద్భుతంగా తీశాడు. ప్రతి సీన్ ను డిఫరెంట్ తీశాడు. కార్తీ తప్ప ఆ పాత్రను ఎవరూ చేయలేరు. పదిహేనేళ్ల తర్వాత నేను చూసిన గొప్ప సినిమా ఇది. హిట్ సినిమా, మంచి సినిమాను కలిపితేనే గొప్ప సినిమా అవుతుంది. అలా ఊపిరి గొప్ప సినిమాగా నిలిచిపోయింది. ఇలాంటి సినిమాను ఆదరించిన అక్కినేని అభిమానులకు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ.... మంచి సినిమాను చేసినందుకు నాగార్జునగారికి, ఆదరించిన తెలుగుప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.... చాలా మంచి సినిమాలు, గుర్తుండిపోయే సినిమాలు చేశాను. సక్సెస్ ను టీంతో, ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేసే సినిమాలు తక్కువ. అలా ఎంజాయ్ చేసిన సినిమాలో ఇదొకటి. కార్తీతో మూడో సినిమా. తనతో హ్యాట్రిక్ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. నాగార్జుగారితో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పివిపిగారికి, సపోర్ట్ చేసిన యూనిట్ సభ్యులకు థాంక్స్ అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.... ఊపిరి తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు కొత్తగా కనపడుతున్నారు. నా ఇన్నేళ్ల జర్నీ ప్రతి ఒక్కరూ సహకారంతో ఇక్కడికి వచ్చాను. నాగార్జునగారు ఏ నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నారో తెలియదు. ఆయన నమ్మకాన్ని ఫ్యాన్స్, ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ కొత్త జీవితాన్నిచ్చారు. నాగార్జుగారి నమ్మకమే ఈ సినిమాను, మమ్మల్ని ముందుకు నడిపించింది. కార్తీగారు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పిన తక్కులే. తమన్నా అందగత్తె కాదు, అమేజింగ్ పర్సన్. నాగార్జునగారు, పివిపి అన్నయ్యే ఊపిరి. ఈ కంటెంట్ ను నమ్మి నాకు నమ్మకాన్ని ఇచ్చినందుకు ఆయనకు పాదాభివందనాలు. ఒక తమ్ముడిలా చూసుకున్నారు. ఆయన విజన్ లేకుండా ఈ సినిమా లేదు. అలాగే హరిగారు, అబ్బూరి రవి, పి.ఎస్.వినోద్, గోపీసుందర్, ఎడిటర్ మధు సహా నా డైరెక్షన్ టీం సహా అందరికీ ఏమిచ్చినా రుణం తీరదు. దాసరిగారు, రాఘవేంద్రరావుగారు, రాజమౌళిగారు, శ్రీనువైట్లగారు, వినాయక్ గారు, హరీష్ గారు, శివగారు ఇలా అందరరూ ఫోన్ చేసి అభినందించారు. మంచి సినిమాను తీస్తే కలిగే గౌరవం ఈ సినిమాతో తెలిసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లెట్ అస్ సెలబ్రేట్ లైఫ్ అని చేసిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మా లైఫ్ బ్యూటీ ఫుల్ చేశారు అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oopiri  Thanks Meet  Collections  Videos  stills  

Other Articles