పెళ్లికి సిద్ధమైన ‘గులాబీ’ హీరో | JD Chakravarthy Marriage Soon

Jd chakravarthy marriage soon

Jd Chakravarthy wedding bells, Jd Chakravarthy marriage updates, Jd Chakravarthy ready for marriage, Jd Chakravarthy tying knot, Jd Chakravarthy latest updates, Jd Chakravarthy

JD Chakravarthy Marriage Soon: actor Jd Chakravarthy is all set to tie the knot. Jd Chakravarthy latest updates, details, stills.

పెళ్లికి సిద్ధమైన గడ్డం హీరో

Posted: 04/18/2016 03:28 PM IST
Jd chakravarthy marriage soon

‘శివ’, ‘సత్య’, ‘గులాబి’ చిత్రాలతో ‘గడ్డం హీరో’ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు జెడీ చక్రవర్తి(46) త్వరలోనే ఓ ఇంటివాడు అవ్వనున్నాడు. ఏ వయసులో కావాల్సిన ముచ్చట.. ఆ వయసులో కావాలంటారు పెద్దలు. కానీ ఇలాంటి పెద్దల ముచ్చట్లకు జెడీ పూర్తి వ్యతిరేకం. అందుకే ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా తన జీవితం కొనసాగిస్తున్నాడు.

అయితే హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్న తరుణంలో పెళ్లికి సిద్ధమయ్యాడు జెడీ చక్రవర్తి. తనకు పెళ్లి చేసుకునే మెచ్యురిటీ ఇప్పటికీ వచ్చిందని, అందుకే పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ ఇచ్చాడట జెడీ చక్రవర్తి. ఢీల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని జెడీ చక్రవర్తి పెళ్లి చేసుకోనున్నాడు. తన తల్లి బలవంతం మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంపై జెడీ చక్రవర్తి స్పందిస్తూ... తాను ఎప్పుడూ పెళ్లికి వ్యతిరేకం అని చెప్పలేదని, కానీ పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత, మెచ్యురిటీ వుండాలని.. ఆ మెచ్యురిటీ తనకు ఇప్పుడు వచ్చాయని అనుకుంటున్నట్లుగా జెడీ చక్రవర్తి తన పెళ్లి విషయాన్ని తెలియజేసాడు. అసలు పెళ్లి చేసుకుంటాడో లేదోననే అనుమానం వారందరికీ... జెడీ చక్రవర్తి పెళ్లికి సిద్ధమవుతుండటంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి జెడీ చక్రవర్తి తన పెళ్లి డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jd Chakravarthy  Marriage  Wedding  

Other Articles