సన్నీ కోసం బాలీవుడ్ లోకి జక్కన్న ఎంట్రీ | Rajamouli enters into bollywood

Rajamouli enters into bollywood

Rajamouli for Mera Bharat Mahan, Rajamouli, Vijayendra Prasad, Baahubali, Jakkanna, Sunny deol, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, రాజన్న, మేరా భారత్ మహాన్, జక్కన్న, movies, stills, gossips, వార్తలు, photos

Rajamouli enters into bollywood: Tollywood director SS Rajamouli going to bollywood as a creative director for his father upcoming hindi film Mera Bharat Mahan.

సన్నీ కోసం బాలీవుడ్ లోకి జక్కన్న ఎంట్రీ

Posted: 04/18/2016 05:59 PM IST
Rajamouli enters into bollywood

ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ‘బాహుబలి’, ‘భజరంగీ భైజాన్’ చిత్రాలున్నాయి. ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించి, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసాయి. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శక, రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘భజరంగీ భైజాన్’ చిత్రానికి కూడా విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా కూడా కలెక్షన్ల రికార్డు సృష్టించింది. కేవలం ఈ సినిమాలే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు విజయేంద్రప్రసాద్ కథను అందించడం జరిగింది. ఇలా పలు కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథను అందించడం వల్ల.. విజయేంద్రప్రసాద్ కు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.

అయితే ఇటీవలే ‘రాజన్న’ సినిమాతో విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా మారారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజన్న పాత్రలో అక్కినేని నాగార్జున నటించారు. అయితే ఈ చిత్రకథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్ చిత్రానికి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు.

అక్కినేని నాగార్జున చేసిన పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ నటించనున్నాడు. అలాగే ఈ చిత్రానికి సన్నిడియోల్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ‘మేరా భారత్ మహాన్’ పేరుతో రూపొందనున్న ఈ రీమేక్ కు ఎస్.ఎస్.రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. ‘రాజన్న’ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్ కు కూడా రాజమౌళి దర్శకత్వ పర్యావేక్షణ చేసారు. ఇక ఈ ‘మేరా భారత్ మహాన్’తో తండ్రికొడుకులు ఇద్దరూ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అనుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగాతెలిసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles