సొగ్గాడికి బ్రహ్మరథం పట్టిన అభిమానులు | Nagarjuna in Nirmala Convent Shooting

Nagarjuna in nirmala convent shooting

Nagarjuna in Nirmala Convent Shooting, Nagarjuna in Pandoor Village, నాగార్జున, సోగ్గాడే చిన్ని నాయనా, Nagarjuna in Nirmala Convent Shooting, నిర్మల కాన్వెంట్, రోషన్, Nagarjuna latest updates, Nagarjuna in Acchampet, Nagarjuna stills

Nagarjuna in Nirmala Convent Shooting: Akkineni nagarjuna producing Nirmala convent film. Srikanth son Roshan introducing as a hero.

సొగ్గాడికి బ్రహ్మరథం పట్టిన అభిమానులు

Posted: 04/21/2016 09:58 AM IST
Nagarjuna in nirmala convent shooting

‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ చిత్రాలతో హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు అక్కినేని నాగార్జునకు అచ్చంపేటలో అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మల కాన్వెంట్’ చిత్ర షూటింగ్ పండూరులో జరుగుతోంది. జి. నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నారు.

అయితే ఇందులోని ఓ గెస్ట్ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఈ షూటింగ్ లో భాగంగా ఆయన పండూరు గ్రామానికి వెళ్లగా అక్కడి ప్రజలు ఆయనకు భారీ స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున అచ్చంపేట జంక్షన్‌కు చేరుకున్నారు. దాదాపు ఒంటిగంట సమయంలో అచ్చంపేట జంక్షన్ కు నాగ్ చేరుకోగానే అక్కడి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆయన కారును చుట్టుముట్టారు.

అచ్చంపేట జంక్షన్ లో నాగార్జునకు కన్నబాబు పూలమాలలతో స్వాగతం పలికారు. అక్కడ నాగార్జున కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి వేలాది మంది అభిమానులతో ఊరేగింపుగా పండూరు చేరుకున్నారు. నాగార్జున కారులో నుంచి దిగేందుకు కూడా చోటులేకుండా పోయింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లను చిత్రీకరించారు కానీ.. నాగార్జున కారు దిగి వచ్చే సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రజలు అవకాశం ఇవ్వలేదు. నాగార్జున రాకతో అక్కడ పండగ వాతావరణం ఏర్పడింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Nirmala Convent  Roshan  

Other Articles