బాహుబలి2 లో ఎన్టీఆర్ పేరు.. | NTR in Bahubali2

Ntr in bahubali2

NTR, Bahubali, Young Tiger, SS Rajamouli, NTR in Bahubali, బాహుబలి, ఎన్టీఆర్, రాజమౌళి

Young Tiger got place to act in SS Rajamoulis Bahubali second part. NTR charactars name also out now. As Jayadev Rana NTR will appear on Bahubali screen.

బాహుబలి2 లో ఎన్టీఆర్ పేరు..

Posted: 04/30/2016 03:08 PM IST
Ntr in bahubali2

తెలుగు, తమిళ్ తో పాటుగా హిందీ భాషల్లో విడుదలై ఇండియన్ సినిమా చరిత్రలో ఓ కొత్త పేజీని లిఖించుకున్న బాహుబలి గురించి తెలియని వాళ్లు లేరు. బాహుబలి సినిమాను రెండు పార్టులుగా తీస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రెండో పార్ట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వచ్చాయి. అయితే అవి గాలి వార్తలు అని చాలా మంది కొట్టేసినా... రాజమౌళి మాత్రం అది నిజమే అంటున్నారు. తనకు ఎంతో ఆప్తమిత్రుడైన ఎన్టీఆర్ కు బాహుబలి 2లో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఇస్తున్నట్లు తేలిపోయింది. ఇదే క్యారెక్టర్ ను తమిళ్ లో సూర్య చేస్తున్నట్లు తెలిసింది.

బాహుబలి కన్నా కూడా ఎంతో అద్భుతంగా బాహుబలి2ను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో స్వయంగా నటిస్తానని సూర్య గతంలోనే వెళ్లడించారు. కాగా తాజాగా తెలుగులో ఎన్టీఆర్ చేస్తున్న క్యారెక్టర్ పేరు కూడా బయటకు వచ్చేసింది. జయదేవ్ రాణాగా ఎన్టీఆర్ బాహుబలి2లో కనిపించనున్నారట. రాజమౌళి, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు అవకాశం లభించింది అని అందరికి తెలసిందే. కాగా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం దీనిపై తెగ ఆనందపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles