కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన తాజా చిత్రం ‘సరైనోడు’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ సినిమాను విజయం చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ చిత్ర యూనిట్ విజయవాడలో నిన్న విజయోత్సవ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా, ఆది పినిశెట్టి, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.... నాకు మొదటి నుంచి అన్ని విధాల అండగా నిలబడుతూ వచ్చిన మెగా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాను మంచి విజయం చేసినందుకు సంతోషంగా వుంది. బోయపాటి శ్రీను గారు నన్ను ఓ మాస్ హీరోగా చూపించారు. ఓ సినిమా విజయం సాధించాలంటే దర్శకుడి తర్వాతే ఎవరైనా. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ముందుగా బోయపాటి గారికే దక్కాలి. ఇక నాన్న(అల్లు అరవింద్), ఓ నిర్మాతగా కాకుండా ఓ తండ్రిగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయనతో కలిసి ఇంత పెద్ద హిట్ కొట్టడం సంతోషంగా వుంది అని తెలిపారు. ఈ వేడుక చివర్లో బన్నీ, రకుల్, కెథరిన్ లు డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more