సినిమా షూటింగ్ సమయాల్లోనే హీరోయిన్లు కాస్త ఆలస్యంగా వస్తారనే విషయం తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలంటే మాత్రం అందుకు మరింత ఎక్కువ రెమ్యునరేషన్ వసూలు చేస్తుంటారు. పైగా ప్రమోషన్ కార్యక్రమాల్లో సరైన ఇన్ఫర్మెషన్ కూడా వుండదు. ఇదిలా వుంటే తాజాగా బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న ప్రణీతకు సూపర్ స్టార్ మహేష్ బాబు పబ్లిక్ గా పరోక్షంగా పనిష్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ ప్రణీత ఏం చేసిందో తెలుసా?
మహేష్, కాజల్, సమంత, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ సరైన సమయానికి వచ్చేసాడు. కానీ మహేష్ వచ్చిన 10 నిమిషాల తర్వాత కాజల్ విచ్చేసింది. ఆ తర్వాత మరో 30 నిమిషాలకు సమంత వచ్చింది. అయితే వీరిద్దరు పలు సినిమా షూటింగ్ లతో బిజీగా వుండటం వల్ల ఆలస్యమయ్యిందని అందరూ భావించారు.
కానీ ప్రస్తుతం తెలుగులో ఎలాంటి అవకాశాలు లేని ప్రణీత మాత్రం ఏకంగా దాదాపు 45నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఈ హీరోయిన్ల ఎంట్రీ సమయాన్ని మహేష్ గమనించాడు. దీంతో ప్రణీతకు అక్కడే తగిన పనిష్మెంట్ ఇచ్చేసాడు. స్టేజ్ పైన కాజల్, సమంతల గురించి మాత్రమే మాట్లాడారు మహేష్.. కానీ తన పక్కనే వున్న ప్రణీత గురించి మాట్లాడనే లేదు. అసలు ప్రణీత ఊసే తీయలేదు. దీంతో తన పేరును ప్రస్తావించకపోవడంతో అందరిముందు నవ్వుతూనే వున్నప్పటికీ.. వేడుక పూర్తవ్వగానే వెంటనే తన కారులో ప్రణీత సైలెంట్ గా వెళ్లిపోయింది.
దీంతో ఈ అమ్మడికి మహేష్ సరైన పనిష్మెంట్ ఇచ్చాడంటూ వేడుకకు వచ్చినవాళ్లంతా కామెంట్లు చేసుకున్నారు. మహేష్ ఇచ్చిన షాక్ కు ప్రణీత బాగానే హర్ట్ అయ్యినట్లుగా తెలిసింది. ఇప్పటికైనా ఏదైనా కార్యక్రమంలో సరైన సమయానికి హాజరవుతుందో లేదో చూడాలి. ముందుముందు ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటుందో లేక మహేష్ పై అలిగి ప్రమోషన్స్ లో పాల్గొగకుండా వుంటుందో చూడాలి. మరి ఏం జరుగనుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more