భాగమతి అలాంటిది కాదట | Anushka Bhagmati Movie Updates

Anushka bhagmati movie updates

Anushka Bhagmati, Anushka Bhagmati details, Anushka movies, Anushka stills, Anushka Baahubali, Anushka bahubali updates, Anushka stills, Anushka hot stills, Anushka

Anushka Bhagmati Movie Updates: South Indian star heroine Anushka upcoming film Bhagmati. Ashok director.

భాగమతి అలాంటిది కాదట

Posted: 05/12/2016 01:59 PM IST
Anushka bhagmati movie updates

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ వంటి వరుస చిత్రాల తర్వాత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క మరోసారి ‘భాగమతి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ టైటిల్ ప్రకటించిన క్షణం నుంచి ఇదేదో చారిత్రాత్మక కథతో రూపొందబోతున్నట్లుగా రకరకాల కథనాలు వినిపించాయి.

కానీ ఇది చారిత్రక కథతో రూపొందడం లేదని దర్శకుడు అశోక్ ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా గురించి అశోక్ తెలియజేస్తూ... అనుష్క ప్రధాన పాత్రలో తాను తెరకెక్కించబోయే సినిమా చారిత్రక కథతో కాదని, ఇది థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే కమర్షియల్ ఎంటర్ టైనర్ అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి అనుష్క ‘భాగమతి’గా ఎలాంటి లుక్ లో కనిపించనుందో చూడాలి. ‘బాహుబలి- కంక్లూజన్’ చిత్ర షూటింగ్ లో అనుష్క బిజీగా వుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జులై లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Bhagmati  Baahubali  

Other Articles