ఎన్టీఆర్ గురించి మహేష్ ఏమన్నాడంటే.. | Mahesh Babu about NTR

Mahesh babu about ntr

NTR, Mahesh Babu, Mahesh, Young Tiger, NTR dance, Young Tiger NTR, Mahesh babu about NTR, ఎన్టీఆర్, మహేష్ బాబు, యంగ్ టైగర్

Prince Mahesh Babu intersting comments on Young Tiger NTR. Mahesh Babu praises NTRs dance and his attitude.

ఎన్టీఆర్ గురించి మహేష్ ఏమన్నాడంటే..

Posted: 05/17/2016 11:13 AM IST
Mahesh babu about ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ లో ఓ స్పెషల్ ఇంప్రెషన్ ఉంది. తన యాక్టింగ్ దగ్గరి నుండి డ్యాన్సుల వరకు అన్నింటా తన మార్క్ చూపిస్తున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది యాక్టర్లు యంగ్ టైగర్ ను మెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆ కోవలోకి ప్రిన్స్ మహేష్ బాబు కూడా చేరాడు. ఇప్పటికి కేవలం చేసింది పాతిక సినిమాలే అయినా కూడా తెలుగు సినిమా తెర మీద తన చిత్రాన్ని ముద్రించుకున్న యంగ్ టైగర్ గురించి ప్రిన్స్ మహేష్ బాబు ఏమన్నాడంటే..

యంగ్ టైగర్ అనగానే అందరికి గుర్తుకు వచ్చే క్వాలిటీ.. డ్యాన్స్. ఎన్టీఆర్ వేసే స్టెప్పులకు ఆయనతోపాటు డ్యాన్సులు చెయ్యలేక హీరోయిన్లు బెంబేలెత్తుతారు. అలాంటి పర్ఫామెన్స్ మహేష్ బాబులాంటి హీరోల నుండి ఎక్స్ పెక్ట్ చేస్తే.. ఖచ్చితంగా తన వల్ల కాదు అంటున్నారు మహేష్. డ్యాన్స్ ఎన్టీఆర్ చేసినంతలా వేరే ఎవరూ చెయ్యలేరు.. ఇక తన విషయానికి వస్తే ఎన్టీఆర్ చేసే డ్యాన్స్ లో కొంత శాతం కూడా తాను చెయ్యలేనని..మహేష్ అన్నారు. డ్యాన్స్ లో ఎన్టీఆర్ కు ఎన్టీఆరే సాటి అని కితాబిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles