70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై తమిళ్, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రభుదేవా ఇంట్రడక్షన్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో ఎమీ జాక్సన్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.... తన డాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసిన కింగ్ ఆఫ్ డాన్స్ ప్రభుదేవా దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల భారీ లెవల్లో చిత్రీకరించిన ప్రభుదేవా ఇంట్రడక్షన్ సాంగ్ పల్లవి వీడియోను జూన్ 3న విడుదల చేయబోతున్నాం. కింగ్ ఆఫ్ డాన్స్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ప్రభుదేవా వేసిన స్టెప్స్ అందర్నీ ఉర్రూతలూగిస్తాయి. అదేరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్‌కి సర్ప్రైజింగ్ గెస్టులు హాజరు కాబోతున్నారు. ఆ సర్ప్రైజింగ్ గెస్టులు ఎవరన్నది అదేరోజు తెలుస్తుంది అన్నారు.
నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ... ఫస్ట్ టైమ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న తమన్నా చాలా ఎక్స్‌లెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది అన్నారు.
ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: మనీష్ నందన్, ఎడిటింగ్: ఆంటోనీ, ఆర్ట్: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more