దృశ్యమ్, గోపాలగోపాల లాంటి కాన్సెప్ట్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ మూవీస్ ని అందించిన విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకుడిగా సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం. ఈచిత్రం యోక్క మెదటి లుక్ ని ఇటీవలే విడదల చేశారు. ఇప్పటికే దాదాపు టాకీ మెత్తం పూర్తయిన ఈచిత్రం ఓ సాంగ్, ఓ ఫైట్ మాత్రమే బ్యాలన్స్ వుంది. ఈచిత్రం యోక్క ఫస్ట్ లుక్ టీజర్ ని జూన్ 6 న విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై లో చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్బమ్గా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ అంటేనే లక్ష్మి, తులసి లాంటి సూపర్‌డూపర్ హిట్స్ గుర్తోస్తాయి. ఈ మద్యకాలంలో హిట్ పెయిర్ గా సూపర్బ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న వీరిద్ధరి కాంబినేషన్ లో, వరుస కాన్సెప్ట్ చిత్రాలతో సన్సేషనల్ సక్సస్ లు సాధిస్తున్న దర్శకుడు మారుతి దర్శకుడిగా మా బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో , ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకష్ణ(చినబాబు) సమర్పణలో నిర్మిస్తున్నాము. దీనికి సంభందించిన మెదటి లుక్ పోస్టర్ ని విడుదల చేయగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి టైటిల్ కి చాలా మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. అలానే జూన్ 6న ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేస్తున్నాం. ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. వెంకటేష్, నయనతార లాంటి నటుల కి మారుతి లాంటి దర్శకుడు తోడైతే ప్రేక్షకుడికి నవ్వుల పంట అవుతుంది.
మా చిత్రం ఆశక్తికరమైన కథతో ఆరోగ్యకరమైన వినోదాన్ని ఫ్యామిలి ఆడియన్స్ అందరికి దర్శకుడు మారుతి వినోదాన్ని వడ్డించటం ఖాయం. భలే భలే మగాడివొయ్ లాంటి చిత్రం తరువాత మారుతి ఎంటర్టైన్మెంట్ కి బ్రాండ్ గా మారాడు. రన్ జా రన్, జిల్ ,ఉత్తమ విలన్," వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. అన్ని సాంగ్స్ చాలా చక్కగా ఇచ్చారు. వినగానే హమ్ చేసుకునేలా వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ గారి కామెడి టైమింగ్స్ ని మైండ్ లో పెట్టుకుని మారుతి డైలాగ్స్ రాసారు. ఇటీవలె యూరప్ లొ అందమైన లోకెషన్స్ లో రెండు పాటలని చిత్రీకరించాం మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి అన్నారు.
ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, బ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి, పృద్వి, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మజి, సంపత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మున్నా వేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర, రజిత, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు.
డాన్స్- బృంద, శేఖర్; స్టంట్స్- రవి వర్మ; ఆర్ట్- రమణ వంక; ఎడిటర్- ఉద్దవ్.ఎస్.బి; పి.ఆర్.ఓ- ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను; సంగీతం- జిబ్రాన్; నిర్మాతలు- సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్; కథ,కథనం,దర్శకత్వమ్ - మారుతి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more