భార్యను చంపాలనుకున్న కరేబియన్ హీరో | johnny depp try to kill his wife amber heard

Johnny depp try to kill his wife amber heard

johnny depp try to kill his wife amber heard, johnny depp try to kill amber heard, johnny depp vs amber heard, johnny depp news, johnny depp movies, amber heard news, johnny depp, amber heard

johnny depp try to kill his wife amber heard: Johnny Depp 'tried to suffocate Amber Heard with a pillow.

భార్యను చంపాలనుకున్న కరేబియన్ హీరో

Posted: 06/02/2016 04:24 PM IST
Johnny depp try to kill his wife amber heard

సినిమా తారలకు డేటింగ్, విడాకులు అనే పద్ధతి బాగా అలవాటే. కానీ ఓ హాలీవుడ్ హీరో మాత్రం తన భార్యను చంపేయాలని ప్రయత్నించాడట. ఇంతకీ ఆ హీరో ఎవరిన అనుకుంటున్నారా? ‘పైరెట్స్ ఆఫ్‌ ది కరేబియన్’ వంటి చిత్రాలతో బాగా పాపులర్ అయిన జానీ డెప్ తన భార్య అంబర్ హర్డ్ ను చంపాలని ప్రయత్నించాడని తాజాగా వెల్లడయ్యింది.

52 ఏళ్ల జానీ నుంచి తనకు విడాకులు కావాలంటూ గత నెల 23న కోర్టులో అంబర్ హర్డ్ విడాకుల పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో అంబర్ స్నేహితుడు వీరిద్దరి గురించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. అంబర్ ను చంపేందుకు జానీ ప్రయత్నించాడని, దిండుతో ఊపిరాడకుండా ఆమెను చంపేయాలని ప్రయత్నించాడని అంబర్ స్నేహితుడు న్యూయార్క్ పోస్ట్ పత్రికకు తెలిపాడు.

దీంతో భయపడిన అంబర్.. తన మొబైల్ నుంచి మెసేజ్ పంపిందని, వెంటనే తాను వారి అపార్ట్ మెంట్ కు వెళ్లి చూసే సరికి.. ఆమె ముఖంపై కమిలిపోయిన గాయం వుందని తెలిపాడు. అంబర్ పెదవి చీరుకుపోయిందని, ఒక కన్నుకు గాయంతో వాపు వచ్చి, తలపై కొన్ని వెంట్రుకలు కూడా ఊడిపోయి వున్నాయని తెలిపాడు. ఆమె పరిస్థితి చూసి తాను ఖంగుతిన్నానని తెలిపాడు.

అనంతరం తనను చంపాలని జానీ ప్రయత్నించాడని అంబర్ చెప్పినట్లుగా అంబర్ స్నేహితుడు వివరించాడు. అంబర్ ను ఎప్పుడు కూడా జానీ కొట్టేవాడని, ఆమెతో దురుసుగా వుండటం తాను చాలా సార్లు చూసానని పత్రికకు తెలియజేసారు. దీంతో కోర్టు కూడా ఈ ఇద్దరు దంపతులు వేర్వేరుగా వుండాలని ఆదేశించింది.

 

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : johnny depp  amber heard  hot stills  

Other Articles