నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా, దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా... మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహ-నిర్మాణంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రోజులు మారాయి’. జి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నఈ చిత్రంతో మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది.
చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రోజులు మారాయి చిత్రం ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన రావటంతో ట్రేడ్ లో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథాచిత్రమ్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన జె.బి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ఆడియోని జూన్ 11న ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై 7న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... మంచి కథల్ని, మంచి చిత్రాల్ని నిర్మించటంలో నేను ఎప్పూడు ముందుంటాను, అందులో భాగంగానే రోజులు మారాయి చిత్ర నిర్మాణంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ భాగమైంది. నిర్మాతల, హీరోల దర్శకుడిగా దూసుకెళ్తున్న మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించారు. జి.శ్రీనివాస రావు నిర్మాత.మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడు. ఫస్ట్ లుక్ కి చాలా క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్ లో క్రేజ్ రావటం విశేషం. మారుతి కథలు ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకుంటాయి. యూత్ తో పాటు ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. మంచి యూత్ ట్యూన్స్ తో రింగ్ ట్రింగ్ అంటూ కుర్రకారు మొబైల్స్ లో రింగ్ టోన్ గా మారిన జె.బి అందించిన ఆడియో ని జూన్ 11న విడుదల చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై 7న విడుదల చేయనున్నాము అని అన్నారు.
చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక, తేజశ్వి, ఆలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర,వాసు ఇంటూరి, జబర్దస్త్ అప్పారావు, శశాంక్, రావిపల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మధుసుదనరావు,హర్ష, సంధ్యజనక్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాణ సారధ్యం- గుడ్‌సినిమా గ్రూప్; సహనిర్మాణం-శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్; కథ,స్క్రీన్‌ప్లే- మారుతి; సమర్పణ- దిల్ రాజు; సంగీతం- జె.బి; మాటలు- రవి నంబూరి; దర్శకత్వం- మురళి కృష్ణ ముడిదాని.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more