ఇప్పటివరకు యాంకర్ గా, యూట్యూబ్ వెబ్ సిరీస్ నటిగా తానేంటో నిరూపించుకున్న నిహారిక ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతుంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 24 విడుదల కానుంది.
అయితే మొదటిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న నటిగా ఫ్యాన్స్ కు ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించడానికి తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వివిధ జిల్లాల నుంచి 200 కు పైగా వచ్చిన మహిళా అభిమానులతో నిహారిక ముచ్చటించి, వాళ్లు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చింది.
ఈ సంధర్భంగా నిహారిక మాట్లాడుతూ నా నుంచి వచ్చే ఏ సినిమా వల్ల అయినా అభిమానులకు గానీ, మా ఫ్యామిలీ కి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. మెగా వారసులను ఆశీర్వదించినట్టుగా నన్ను కూడా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను. ‘ఒక మనసు’ గురించి చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది. నా మొదటి చిత్రంకు ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఈ చిత్రం తర్వాత ఖచ్చితంగా ఆడపిల్లల్లో ప్రేమ విషయంలో మార్పు వస్తుంది. ఫ్యామిలీ అంతా వెళ్లి చూసేలా ఒక మనసు ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. నాగశౌర్యతో చేయడం చాలా హ్యాపీ. ఇప్పటికే పాటలను కొన్ని లక్షల మంది విన్నారు. నిజంగా అద్భుతమైన పాటలు ఇచ్చాడు సునీల్ కశ్యప్. నా కోసం ఇంత దూరం వచ్చిన మా మెగా అభిమానులందరికీ చాలా కృతజ్ఞతలు. ఈనెల 24న ‘ఒక మనసు’తో థియేటర్లలో కలుద్దాం అని చెప్పుకొచ్చింది.
బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఒక మనసు’ సినిమాకు సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, వీడియోలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై నిహారిక చాలా ఆశలే పెట్టుకుంది. మరి ఈ సినిమా హిట్టవుతుందో లేదో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more