samantha said so many people working behind me and my success

Samantha said so many people working behind me and my success

samantha interview, samantha films, samantha in tollywood, samantha up coming movies, samantha next, samantha movies, samantha hot, samatha galamour, samantha in A Aa

actress samantha said so many people working behind me and my success. in my followers and well wishers advices me to how to act, and how to improve my self. i bileive that.

వాళ్లంటే నాకు ఇష్టం...!

Posted: 06/18/2016 01:35 PM IST
Samantha said so many people working behind me and my success

టాలీవుడ్ లో ప్రస్తుతం సమంత నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అ-ఆ సినిమా హిట్ తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఈ అమ్మడు తన విజయానికి సీక్రెట్స్ చెప్తోంది. అ- ఆ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ 'మన చుట్టూ ఎంతోమంది ఉండొచ్చు. కానీ కొందరినైనా మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. నాకూ అలాంటి గ్యాంగ్‌ ఒకటి ఉంది. నా నమ్మకాన్ని వాళ్లెప్పుడూ నిలబెడుతూనే ఉంటారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచేదీ వాళ్లే. నా బలమూ వాళ్లే’’ అంటోంది.


నేను చిన్నప్పటినుంచి ఎక్కువమంది తో స్నేహం చేయలేదు. నా స్నేహితుల జాబితా చిన్నదే. కానీ వాళ్లంతా నాతో నిజాయతీగా వ్యవహరిస్తారు. నా మెప్పు కోసం లేనిపోని గొప్పలు చెప్పరు. ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతారు. తప్పు చేస్తే మొహంమీదే చెప్పేస్తారు. అలాంటి వాళ్లంటేనే నాకు ఇష్టమని చెప్పింది. అందుకే, వారి వల్లే నేను ఎన్నో నేర్చుకొన్నానని, నేనేమైనా తప్పు చేస్తే వాళ్లు సరి చేస్తారు కదా అన్న నమ్మకం నాలో పెరిగిందని అంటోంది.

నాకంటూ కొంతమంది ప్రత్యేకమైన అభిమానులున్నారు. వాళ్లతో ట్విట్టర్‌లో ఎప్పుడూ టచ్‌లో ఉంటానని వాళ్లంతా నా వెల్ విషర్స్ మాత్రమే కాదు నాలో లోపాలని ఎప్పటికప్పుడు చెప్తూ తప్పులని సరిదిద్దతుంటారని చెప్పింది. అంతేకాదు ఆమె సక్సెస్ లో వీళ్లందరూ కూడ ఉన్నారని చెప్తోంది ఈ చిన్నది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన జనతాగ్యారేజ్ సినిమాలో ఎక్స్ పోజింగ్ కూడ చేసిన సమంత త్వరలోనే పెళ్లి కూడ చేసుకోబోతోందట.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha hot  samantha next movies  samantha A Aa  samantha beauty  

Other Articles