కమల్ తర్వాత నానియే అంట! | niveda thomas says she likes Nani after Kamal

Niveda thomas says she likes nani after kamal

niveda about her Co-Star Nani, కమల్ తర్వాత నానియేనంట, నానిని తెగ పొగిడేస్తోంది, కమల్ తర్వాత నాని, నివేద థామస్ తెగపొగిడేస్తోంది, జెంటిల్ మెన్ భామ కమల్, నాని ఫ్యాన్, latest news, telugu news, entertainment, niveda thomas gentleman interview, niveda praised nani, telugu news

Speaking about her Co-Star Nani during the promotional campaign, Niveda Thomas said: 'I like Kamal Haasan very much. After him, Nani is one actor who's acting looks so natural. His performance in film such as Ashta Chemma & Pilla Zamindar is too good'.

కమల్ తర్వాత నానియేనంట!

Posted: 06/20/2016 03:16 PM IST
Niveda thomas says she likes nani after kamal

సినిమాలకు సంబంధించి ఇంటర్వ్యూల సమయంలో హీరోహీరోయిన్లు ఒకరినోకరు తెగ పొగిడేసుకోవటం కామనే. జెంటిల్ మెన్ భామ నివేద థామస్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా హిట్  టాక్ తో రన్ అవుతుండటంతో తెగ సంతోషంగా ఉంది. అంతేకాదు సినిమాలో నాని తర్వాత ఈ ముద్దుగుమ్మ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. దీంతో టీవీ చానెళ్లలో ఎక్కడా చూసినా నివేదానే కనిపిస్తోంది. పనిలో పనిగా తెలుగులో అనర్గళంగా మాట్లేడేస్తున్న ఈ మల్లు భామ తన హీరో నానిని పొగడ్తలతో ముంచెత్తుంది.

నటనలో తనకు కమల్ హసన్ అంటే చాలా ఇష్టమని, ఆ తర్వాత నాని నచ్చుతాడని చెబుతోంది. తన నటించిన అష్టాచెమ్మా, పిల్ల జమీందార్ సినిమాలు బాగా ఇష్టమని అంటోంది. పొగిడితే పొగిడింది కానీ, మరీ మొదటి చిత్రానికే హీరోను మోసేయటం మూలంగా ఆమెకొచ్చే లాభమేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎంత నేచురల్ స్టార్ అయితే మాత్రం మరీ కమల్ హసన్ తర్వాత అనటం కాస్త టూమచ్ అయిందంటున్నారు. అయినా అది అమ్మడి పర్సనల్ ఒపినీయనేగా.

ప్రస్తుతం ఆర్కిటెక్ కోర్సు చేస్తున్న నివేద సినిమా ఆఫర్ల విషయంలో ఏ మాత్రం తొందరపడటం లేదు. స్కిన్ షోకి కొత్త హీరోయిన్లు ఏ మాత్రం వెనకాడకపోతున్నప్పటికీ తన విషయంలో మాత్రం కాస్త ఢిపరెంట్ అంటోంది. ముందు పాత్ర ప్రాధాన్యమంటూ, ఎక్స్ పోజింగ్ కి సెకండ్ ప్రయారిటీ ఇస్తానంటోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : niveda thomas  nani  kamal hassan  

Other Articles