జనతా గ్యారేజ్ గురించి మరో రూమర్ | Devayani joins in janatha garage shooting

Devayani joins in janatha garage shooting

actress devayani Janatha Garage, Mohan Lal wife Devayani, NTR Janatha Garage News, Janatha Garaje Fake news, Rumours about Janatha garage, Janatha Garaje Story, గ్యారేజ్ లో మహేష్ తల్లి, జనతా గ్యారేజ్ లో దేవయాని, జనతా గ్యారేజ్ గురించి ఫేక్ న్యూస్, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్

Devayani joins in janatha garage shooting. Devayani plays Mohan Lal wife character in Janatha Garage.

జనతా గ్యారేజ్ గురించి మరో రూమర్

Posted: 06/24/2016 06:02 PM IST
Devayani joins in janatha garage shooting

యంగ్ టైగర్ 'జనతా గ్యారేజ్' వీలైనంత త్వరగా చాపచుట్టేయాలని టీం ఓవైపు ప్రయత్నిస్తుంటే, సినిమాపై రోజుకో గాసిప్ బయటికి వస్తున్నాయి. సినిమాలో ఓ కీలకమైన ముఖ్యమైన పాత్ర కోసం ఒకప్పటి నటి దేవయానిని తీసుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆమెను ఆ పాత్ర నుంచి తప్పించి మరో నటి సుహసినిని ఎంచుకున్నారనే మరో టాక్ బయటికి వచ్చింది

అయితే ఆ రూమర్లన్నింటికీ పుల్ స్టాప్ పెడుతూ తాజాగా సినిమా స్టిల్స్ ను బయటికి రిలీజ్ చేశారు. ముందుగా అనుకున్నట్లు దేవయానిని ఏ పాత్ర కోసమైతే అనుకున్నారో, ఆ పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ రూమర్లకు చెక్ పెట్టినట్లయ్యింది. నిన్నటి తరం కథానాయికగా దేవయాని అటు తమిళంలోను, ఇటు తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో సుస్వాగతంలో హీరోయిన్ గా నటించిన ఆమె, మహేష్ కు తల్లిగా నాని చిత్రంలో చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఆమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఆగస్టు 12న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress devayani  Janatha Garage  NTR  Mohan Lal  

Other Articles