kabali audio release by mega prince varun teja at hyderabad

Kabali audio release by mega prince varun teja at hyderabad

kabalai audio, kabali movie , kabali movie release date, kabali movie tickets, kabali rajini kanth, kabali next movie, rajinikanth kabali, varun teja released audio, kablai audio out, kabali telugu audio

kablai movie audio release by mega prince varun teja at hyderabad. this movie looking like basha movie we are eagarly waiting for this movie said nani in this function.

కబాలి ఆడియో అదిరింది...!

Posted: 06/27/2016 12:25 PM IST
Kabali audio release by mega prince varun teja at hyderabad

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘కబాలి’. రాధికా ఆప్టే హీరోయిన్ గా, పా రంజిత్ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న 'కబాలి' సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని షణ్ముఖ ఫిల్మ్స్ సంస్థ అందిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ హైదరాబాద్ లో ఘనంగా  జరిగింది. తొలి సీడీని టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , టీజర్ ని నాని విడుదల చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘‘పెదనాన్నగారి ‘ఇంద్ర’ చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడ అక్కడికి వెళ్లా. ఆ సమయంలో రజనీ సార్ ని తొలిసారి కలిశా. ఆయన ఎంత సింపుల్ గా ఉంటారో నాకు అర్థమైంది. ‘బాషా’ తరవాత రజనీసార్ ని ఆ తరహా పాత్రలో చూపిస్తున్నారు రంజిత్ గారు. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారిలో నేను కూడ ఒకటిని అని అన్నాడు.  

హీరో నాని మాట్లాడుతూ ‘‘రజనీసార్ కి నేను వీరాభిమానిని. చిన్నప్పుడు అందరిలానే నేనూ రజనీకాంత్ గారిని అనుకరించాలని చూసేవాణ్ని. శంకర్ గారంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయన తీస్తున్న ‘2.0’ కంటే ‘కబాలి’పైనే నా ధ్యాస మళ్లింది. ఎందుకంటే, రజనీసార్ ని రోబోలా చూడ్డం కంటే ఓ ‘బాషా’లా చూడ్డంలోనే ఎక్కువ కిక్ ఉందన్నాడు.
 
కబాలి ఆడియో అదిరిందని, ఇప్పుడు ఈ సినిమాపై అందరి దృష్టి ఉందని, ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పారు అందరూ. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయనుందో చూడలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles