Trisha nayaki again postponed due to censor

Trisha nayaki again postponed due to censor

Trisha nayaki postponed, Trisha nayaki july 15, Nayaki satyam rajesh, Trisha Nayaki Hero, Trisha Nayaki Actress

Actress Trisha's thriller movie facing censor problems pushed to 15th July now.

తెలుగు నాయకి తమిళ కష్టాలు

Posted: 07/04/2016 03:55 PM IST
Trisha nayaki again postponed due to censor

లేడీ ఓరియంటల్ చిత్రాలపై క్రేజుతో త్రిష ప్రదాన పాత్రలో రూపుదిద్దిన చిత్రం నాయకి. హర్రర్ నేపథ్యంతో రాబోతున్న చిత్రం కావటంతో అంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని చివరికి ఈ శుక్రవారం (జూలై 8న) రిలీజ్ చేయాలని నిర్మాతలు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆ రోజున విడుదల కావటం లేదని తెలుస్తోంది.

ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో రూపొందిచాడు దర్శకుడు గోవి. దీంతో రిలీజ్ కూడా రెండు భాషల్లోనే చేయాలని భావిస్తున్నాడు. తెలుగు సెన్సార్ పూర్తయినప్పటికీ, తమిళ్ వర్షన్ నాయగి కి సెన్సార్ ఇంకా పూర్తి కాలేదంట. దీంతో జూలై 15కి సినిమాను పోస్ట్ పోన్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమా వాయిదా పడుతూ వస్తున్నప్పటికీ ఫైనల్ గా త్రిష నటనతో అభిమానులకు పుల్ ట్రీట్ అందించడం ఖాయమని చెబుతున్నాడు దర్శకుడు గోవీ. సత్యం రాజేష్, సుష్మా రాజ్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ చిత్రానికి గాయకుడు రఘుకుంచె సంగీతాన్ని అందించాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  nayaki  satyam rajesh  sushma raj  

Other Articles