వారి కోసం ఛార్మి కత్తిరించేసుకుంది | Actress charmi hair cut for cancer patients

Actress charmi hair cut for cancer patients

Charmi lost hair for good cause, charmi with cancer patients, Charmi lost hair for cancer

Actress charmi hair cut for cancer patients. She has decided to chop her locks as she wanted to get wigs made out of her for two cancer patients.

వాళిద్దరి కోసం ఛార్మి కత్తిరించేసుకుంది

Posted: 07/06/2016 04:18 PM IST
Actress charmi hair cut for cancer patients

కేవలం 15 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హిట్లు, ఫట్లతో సంబంధం లేకుండా ఏకదాటిగా 14 ఏళ్ల నుంచి సినిమాలు చేసుకుంటూ పోతుంది. అయినప్పటికీ చార్మిపై అందంలో ఏ మాత్రం మార్పు లేదు. వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే తాజాగా ఉంది. అందుకే ఆఫర్లు ఆమె వెంటపడుతున్నాయి. సినిమాలోనే కాదు సోషల్ సర్వీస్ లో కూడా ఈమె ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా కాన్సర్ పెషంట్ల కోసం ఓ అరుదైన నిర్ణయం తీసుకుంది.

సాయం చేయమంటే చాలామంది, ఆర్థిక సాయం చేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ, వారికి ఆనందం పంచడంలోనే నిజమైన కిక్కు ఉంటుందని ఛార్మి గ్రహించింది. అంతే తన జుట్టును త్యాగం చేసింది. ఏంటీ అనుకుంటున్నారా;? అక్కడికే వస్తున్నాం... తన స్నేహితుడి నివాసం సమీపంలో ఉండే ఇద్దరు కేన్సర్ పిల్లలు తన వీరాభిభిమానులని తెలిసి ఛార్మి స్వయంగా వెళ్లి వారిని కలిసింది. ఆ టైంలో ఆ పిల్లలిద్దరూ ఆమె జుట్టు పట్టుకుని, 'అక్కా నీ జుట్టు ఎంత బాగుందో' అని వారిద్దరూ ముచ్చటపడ్డారంట.

దీంతో వారికి అంతగా నచ్చిన తన జుట్టుతో విగ్గులు చేయించాలని భావించానని ఛార్మీ చెప్పింది. తన హెయిర్ స్టైలిస్ట్ ను పిలిచి, 18 అంగుళాల జుట్టును కత్తిరించి, వారిద్దరికీ విగ్గులు చేయించానని తెలిపింది. త్వరలో వారిద్దరినీ మళ్లీ కలిసి విగ్గులు అందజేస్తానని తెలిపింది. అవి అందజేస్తుండగా వారి కళ్లలో వెలుగులు చూస్తూ ఆనందిస్తానని ఛార్మి చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Actress Charmi  cut hair  cancer patient  

Other Articles