allari naresh selfie raja movie sharwanand voice

Allari naresh selfie raja movie sharwanand voice

sharwanand voice, selfieraja movie, sharwanand movie, allari naresh movie, allari naresh next movie, selfie raja release date, selfie raja theatres, selfie raja tickets

sharwanand voice over given to selfie raja movie for allari naresh. two heros are have good market in tollywood. they are acted in past together in many movies.

నరేష్ సినిమా శర్వానంద్ వాయిస్...!!

Posted: 07/12/2016 11:02 AM IST
Allari naresh selfie raja movie sharwanand voice

సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్ కామెడీ మార్క్ తో తెరకెక్కుతున్న సినిమా సెల్ఫీ రాజా. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
నరేష్ సరసన సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ హీరో శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తుండ‌టం విశేషం. ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ సినిమాకు ప్లస్ అవుతుంద‌ని చిత్రయూనిట్ భావిస్తుంది.

గ‌మ్యం వంటి బెంచ్ మార్క్ మూవీతో పాటు, నువ్వా నేనా అనే ఎంట‌ర్ టైనింగ్ మూవీలో శ‌ర్వానంద్‌, అల్లరి న‌రేష్‌ల కాంబినేష‌న్ స‌క్సెస్ అయ్యింది. సెల్ఫీరాజా చిత్రానికి వాయిస్ అందించ‌డం ద్వారా వీరు మూడోసారి క‌లిసి ప‌ని చేస్తున్నారు కాబట్టి సినిమా మంచి సక్సెస్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ సినిమాపై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, ఈ సినిమా హిట్ అయితేనే అతనికి మునుపటిలాగా మార్కెట్ ఉంటుందని భావిస్తున్నారు సినీ పండితులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  hero sharwanand  allari naresh movie  sharwanand dubbing  

Other Articles