ప్రమాదంలో గాయపడ్డ కమల్ హాసన్|slipped from steps kamal hassan hospitalised

Slipped from steps kamal hassan hospitalised

kamal hassan hospitalised, universal hero in apollo

slipped from steps kamal hassan hospitalised

ప్రమాదంలో గాయపడ్డ కమల్ హాసన్

Posted: 07/14/2016 08:37 AM IST
Slipped from steps kamal hassan hospitalised

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఆస్పత్రి పాలయ్యారు. గురువారం ఉదయం చెన్నైలోని తన కార్యాలయంలో మెట్లపై నడుస్తున్న క్రమంలో ఆయన కాలుజారి పడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. వెనువెంటనే స్పందించిన ఆయన కార్యాలయ సిబ్బంది కమల్ ను హుటాహుటిన నగరంలోని అపోలో ఆసుపత్రికి తకలించారు. కమల్ కు వైద్య పరీక్షలు చేసిన అపోలో వైద్యులు ఆయన కాలికి అయిన గాయం ఏ పాటిదో పరిశీలిస్తున్నారు.


తమిళ చిత్ర సీమలోనే కాకుండా యావత్తు భారత చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమల్ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కాసేపట్లో వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కమల్ తన సొంత ప్రాజెక్టు శభాష్ నాయుడులో బిజీగా ఉన్నారు. ఆ పనుల నిమిత్తమే ఉదయం ఆఫీసు వెళ్లగా ఈ ప్రమాదం సంభవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal hassan  Apollo  injured  

Other Articles