బూతు సినిమాపై కేసు పెట్టిన హీరో | Shiney Ahuja Legal Notice Against Great Grand Masti Makers

Shiney ahuja legal notice against great grand masti makers

Shiney Ahuja, Legal Notice Against Great Grand Masti, Shiney Ahuja insulted by adult movie, bollywood hero case aginst GGM

Shiney Ahuja Legal Notice Against Great Grand Masti Makers.

బూతు సినిమాపై కేసు పెట్టిన హీరో

Posted: 07/15/2016 05:25 PM IST
Shiney ahuja legal notice against great grand masti makers

బాలీవుడ్ లో అడల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల హవా ఏపాటిదో గ్రాండ్ మస్తీ సినిమాను చూస్తే తెలుస్తుంది. వందకోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం సీక్వెల్స్ తో నిర్విరామంగా సాగిపోతుంది. ఈరోజు గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను ఆపేయాలంటూ కేసు వేశాడు ఓ బాలీవుడ్ నటుడు.

షైనీ అహూజా గుర్తున్నాడా? గ్యాంగ్ స్టర్, వో లమ్ హే చిత్రాల ద్వారా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటుడు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలపై కెరీర్ ను నాశనం చేసుకున్న ఈ నటుడు ఆ దెబ్బకు భార్యకు దూరమై ఒంటరి జీవితం అనుభవిస్తున్నాడు. ఇన్నాళ్లూ అజ్నాతంలో ఉన్న ఈ రొమాంటిక్ హీరో సడన్ గా తెరపైకి వచ్చాడు. అంతేకాదు గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాపై కేసు కూడా వేశాడు.ఈ సినిమాలో ఓ పని మనిషి క్యారెక్టర్ ఉంటుంది. దాని పేరు షైనీ అయితే తనను ఉద్దేశించి ఆ పాత్ర పెట్టారని, పేరు కూడా వాడారని చెబుతున్నాడు. మరీ వల్గర్ గా ఆ పాత్రను చిత్రీకరించడంతోనే తాను కేసు పెడుతున్నానని చెబుతున్నాడు.

అన్నట్లు సెన్సార్ వాళ్లు బ్యానర్ చేసిన టాప్ టెన్ సినిమాల్లో ఇతగాడు నటించిన ది సిన్స్ సినిమా కూడా ఉంది. క్రైస్తవ సన్యాసులను అవమానకరరీతిలో చూపటమే కాకుండా, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందునే ఆ చిత్రానికి మన దేశంలో నిషేధించారు. అందులో లీడ్ రోల్ చేసింది షైనీ యే మరి అలాంటి షైనీ ఆరోపణలకు దిగటం ఆశ్చర్యంగా ఉందని గ్రేట్ గ్రాండ్ మస్తీ యూనిట్ అంటోంది. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావటంతోనే పబ్లిసిటీ కోసం చిత్ర నిర్మాతలే ఇలా చేయిస్తున్నారన్న వాదనా లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiney Ahuja  Great Grand Masti  Legal Notice  

Other Articles