లేడీస్ టైలర్ సీక్వెల్ లో రానా తమ్ముడు అభిరామ్ | will Daggubati Abhiram apt for ladies tailor sequel

Will daggubati abhiram apt for ladies tailor sequel

Vamshi's ladies tailor sequel, fashion designer son of ladies tailor, fashion designer S/O ladies tailor, Rana brother abhiram movie, Abhiram daggubati debut movie, vamshi rana brother, vamshi rana, Abhiram aggubati

will Daggubati Abhiram apt for Vamshi's ladies tailor sequel

రానా తమ్ముడు సరితూగుతాడా?

Posted: 07/21/2016 12:37 PM IST
Will daggubati abhiram apt for ladies tailor sequel

ఆల్ టైం హిట్స్ సినిమాలను రీమేక్ చేయాలన్న ఆలోచన ఒక ఎత్తయితే, దానికి సరిపోయే నటీనటులను ఎంపిక చేయటం కత్తిమీద సాములాంటిదే. ఏ మాత్రం తేడా వచ్చినా సరే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. పై పెచ్చు క్లాసిక్ చిత్రాన్ని చెడగొట్టారన్న అపవాదు మిగిలిపోతుంది. గతంలో రాంచరణ్ బాలీవుడ్ లో జంజీర్ రీమేక్ చేసి ఇలాగే విమర్శల పాలయ్యాడు.

ఇక ప్రస్తుతం విషయానికొస్తే... రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లోనే తొలి హిట్ గా నిలిచి మైలు రాయిగా మారిన చిత్రం లేడీస్ టైలర్. మూడు దశాబ్దాల క్రితం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన చిత్రం అది. దానికి సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నాడు దర్శకుడు వంశీ. 'ఫ్యాషన్ డిజైనర్ ... సన్నాఫ్ లేడీస్ టైలర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అక్కడ ముగిసిన కథకు కొనసాగింపుగా సుందరం(రాజేంద్రప్రసాద్) కొడుకు మీద ఈ సినిమా ఉండబోతుంది.

ఈ సీక్వెల్ లో హీరోగా మొదట్లో రవితేజను అనుకున్నారు. తర్వాత రాజ్ తరుణ్ అన్నారు. ఇప్పుడు కొత్త నటుడు అభిరామ్ వచ్చాడు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అయిన అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. కథ ఇప్పటికే రెడీ కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇక పాత సినిమాలోలాగే ఇందులో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారంట. అంతేకాదు 'లేడీస్ టైలర్' రాజేంద్రప్రసాద్ కూడా ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వుందని చెబుతున్నారు. మధురశ్రీధర్ నిర్మించబోయే ఈ చిత్రం కోసం టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles