నితిన్ తో ఎంజాయ్ చేస్తున్న సమంత, రకుల్, రెజీనా | Nithin enjoying with Regina, Samantha and Rakul

Nithin enjoying with regina samantha and rakul

Nithin samantha regina and rakul, samantha rakul regina nithin, nithin enjoy with samantha rakul and regina

Nithin enjoying with Regina, Samantha and Rakul in Belgium.

నితిన్ తో ఎంజాయ్ చేస్తున్న ముగ్గురు హీరోయిన్లు

Posted: 07/26/2016 09:38 AM IST
Nithin enjoying with regina samantha and rakul

యంగ్ నటుడు నితిన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? కథల ఎంపిక కోసం ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాడు? ఇలా అనుకుంటుండగానే సడన్ గా యూరప్ టూర్ లో తేలాడు. తేలితే తేలాడు గానీ నిజంగానే ముగ్గురు హీరోయిన్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అది సినిమా కోసం ఏ మాత్రం కాదు. రియల్ గానే...

తాజాగా అ..ఆ.. సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన నితిన్ తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఏ మాత్రం తొందరపడటం లేదు. ఇష్క్ , గుండె జారి గల్లంతయ్యిందే సినిమాల సీక్వెల్స్ తోపాటు, మరో సబ్జెక్టు అతని కోసం రెడీగా ఉన్నాయి. కానీ, ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే ఈ లోగా యూరప్ టూర్ కి వెళ్లాడు. అక్కడ తన ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడంట. వారెవరో కాదు...

సమంత, రకుల్ మరియు రెజీనాలు. అవును... నిజంగానే వారిప్పుడు బెల్జియం లో సరదాగా నితిన్ తో గడుపుతున్నారంట. రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చిందిగా అది షేర్ చేసింది నితినే.  ఇందులో డిజైనర్ నీరజ కోన కూడా ఉంది. చిట్టి పొట్టి నిక్కర్లలో వారంతా కనువిందు చేస్తున్నారు.  అయితే ఆ ఫోటోలో పాపం నితిన్ మాత్రం లేడు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin  samantha  regina  rakul  belgium  kona neeraja  

Other Articles