పవన్ సత్యమేవ జయతే ఉంది | Pawan Kalyan not existed from ETV show

Pawan not existed from etv show

pawan kalyan ETV show, Pawan satyameva jayathe, Pawan show in Etv, Krish for Pawan's Show

Pawan Kalyan not existed from Aamir Khan's satyameva jayathe like show in ETV.

పవన్ టీవీషో ఆగడానికి అసలు కారణం

Posted: 07/26/2016 11:53 AM IST
Pawan not existed from etv show

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అమీర్ ఖాన్ సత్యమేవ జయతే తరహాలో ఓ కార్యక్రమం చేయాలని ప్రముఖ ఛానెల్ ఈటీవీ ఆ మధ్య ఫ్లాన్ చేసింది. సామాజిక స్పృహతో కూడిన ఈ షో ద్వారా ప్రజా సమస్యలను చూపటంతో పాటు, చివర్లో నేతల అభిప్రాయలను, సమస్య సాధన దిశగా కృషి చేసే దిశగా ఈ ప్రోగ్రాం ఉండబోతుందని అప్పట్లో ప్రచారం సాగింది.

అయితే ఆ ఆలోచనను ఈటీవీ విరమించుకుందని, సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ కావటంతోనే ఈ నిర్ణయానికి వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఉత్తదేనని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఈటీవీతో పవన్ కి ఉన్న అనుబంధం, పైగా 20 వార్షికోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయిన సమయంలో, తర్వాత కూడా చాలా సార్లు  ఈ కార్యక్రమం గురించే చర్చించాడంట. అయితే పవన్ లాంటి స్టార్ ను హ్యాండిల్ చేసే దర్శకుడు దొరక్క పోవటంతో ఈ కార్యక్రమంను వాయిదా వేసినట్లు  సమాచారం.

దర్శకుడి ఎంపిక జరగ్గానే ఈ కార్యక్రమం మొదలు కాబోతుందట. ఇంకోవైపు కాస్త సోషల్ టచ్ ఉన్న దర్శకుడు క్రిష్  అయితే ఈ కార్యక్రమాన్ని సరిగ్గా లీడ్ చేయగలడని రామోజీ రావు ఆలోచనలో ఉన్నాడంట. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Etv  Ramoji Rao  satyameva jayathe  

Other Articles