శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ విడుదల | Srirastu subhamastu trailer released

Full fun and entertainment in srirastu subhamastu trailer

Allu Srirish's Srirastu subhamastu, Srirastu subhamastu trailer talk, Srirastu subhamastu cast, Srirastu subhamastu lavanya tripati

Allu Srirish's Srirastu subhamastu trailer out.

ట్రైలర్ : శ్రీరస్తు శుభమస్తు... ఇంకో సోలోనా?

Posted: 07/26/2016 03:05 PM IST
Full fun and entertainment in srirastu subhamastu trailer

మెగా కోటాలో ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు దాటినప్పటికీ  ఇంకా ఖాతా తెరవలేదు అల్లు శిరీష్. రెండే చిత్రాలు తీసినా అవి రెండు డిజాస్టర్లుగా మారాయి. అయితే ఈసారి మాత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో అలరిద్దామని సోలో ఫేం పరశురాం దర్శకత్వంలో శ్రీరస్తు శుభమస్తుగా రాబోతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.  

ఇక ట్రైలర్ విషయానికొస్తే... ఫస్ట్ సైట్ లోనే ఓ అమ్మాయికి పడిపోయిన యువకుడు ఆమెకు ఇష్టం లేకపోయినా వెంటపడుతుంటాడు. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి చేరి, కుటుంబం మెప్పు పొంది ఆమెను పెళ్లి చేసుకుంటాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ ఎక్కడో చూసినట్టే ఉంది. కాకపోతే మూడో చిత్రానికి శీరీష్ లో కాస్త మెచ్యూరిటీ కనిపిస్తోంది. యాక్టింగ్ తో పాటు ఫేస్ వాల్యూలోనూ కాస్త పురోగతి సాధించాడు. ట్రైలర్ మొత్తం కామెడీ నుంచి ఇటు పంచ్ డైలాగ్స్ వరకూ.. ఎమోషన్స్ నుంచి  సెంటిమెంట్స్ వరకూ సూపర్బ్ గా కుదిరాయి.

ఎరోగంట్ ఫాదర్ గా మరోసారి ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ఎంత దూరం చేసుకోవాలనుకున్న కొన్ని మనకు దూరం కావు అవి వస్తువులయినా, మనుషులయినా అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ బావుంది.  హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్యూట్ గా అల్లరి పాత్రలో నటించినట్లుంది.  హీరోని ఓ సారి అన్నయ్య అని.. ఓ సారి తమ్ముడు అని ఏడ్పించింది. చివర్లో వచ్చే డైలాగ్ 'మేడమ్ - నేనే బ్లాక్ మెయిల్ చేసేట్లయితే.. మీ దగ్గర్నుంచి చాలా అడగ్గలను' అంటూనే అమ్మాయి బాడీని పైనుంచి కిందవరకూ చూసే సీన్ బాగా పేలింది.

మొత్తానికి భారీ కాస్టింగ్ తో శ్రీరస్తు శుభమస్తు ద్వారా దర్శకుడు పరుశ్ రాం మరో సోలో సినిమానే తీశాడేమోనన్న అనుమానాలు ఉన్నప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srirastu Subhamastu  trailer  Allu sirish  Lavanya Tripati  Prakash Raj  Rao Ramesh  

Other Articles