గాయం నుంచి కొలుకుంటున్నట్లు కమల్ ట్వీట్ | kamal hassan says recover soon in twitter

Kamal hassan says recover soon in twitter

kamal Hassan Gandhi, kamal Hassan says recover soon, kamal Hassan Health, Kamal Hassan dis charge, Kamal Hassan Sabash Naidu

kamal Hassan says recover soon in twitter. compared with him Gandhi.

కమల్ గాంధీలా మారిపోయాడంట...

Posted: 08/03/2016 10:52 AM IST
Kamal hassan says recover soon in twitter

కమల్ హాసన్ నటనకు ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. అందుకేనేమో యూనివర్సల్ హీరో అనే పదం ఆయనకు సరిగ్గా సరిపోతుందని పెట్టేసినట్లు ఉన్నారు. 61 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరో మాదిరి ఆయన వేసే స్టెప్పులు, రిస్కీ ఫైట్లు సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చో తెలియజేస్తాయి. అలాంటి కమల్ ఇటీవల చిన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

చెన్నైలోని తన కార్యాలయంలో మెట్ల మీద నుంచి జారిపడిన ఆయనకు శస్త్ర చికిత్స జరగ్గా ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు బెంగపడొద్దని ధైర్యం చెబుతున్నాడు. ‘ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడగల్గుతున్నాను. గదిలో చిన్నగా అటూ ఇటూ నడవగల్గుతున్నాను. అయితే, గాంధీజీకి రెండు వైపులా ఇద్దరు సహాయకులున్నట్లుగా ప్రస్తుతం నాకు కూడా ఉన్నారు. ఈరోజు కాలి నొప్పి కొంచెం తక్కువగా ఉంది’ అంటూ చమత్కారంగా కమల్ తన ట్విట్టర్ లో ట్వీటాడు.

ఏదేమైనా లోకనాయకుడు త్వరగా కోలుకోవాలని అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. అప్ కమింగ్ మూవీ శభాష్ నాయుడు ఆగిపోయిందని వార్తలు వస్తున్న కమల్ కూడా త్వరలో సెట్ లో జాయిన్ అయి అందరి నోళ్లు మూయించాలని చూస్తున్నాడు. కాగా, ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కుమార్తె శ్రుతి హాసన్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  Leg injure  recover  sabash naidu  

Other Articles