లోకనాయకుడు కమల్ హాసన్ కి మరో అరుదైన అవార్డు వచ్చి చేరింది. 61 ఏళ్ల ఈ లెజెండరీ నటుడికి తమ దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించింది ఫ్రాన్స్ . కళలు, సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న వారికి ఆ దేశ సాంస్కృతిక శాఖ ‘చెవాలియర్ డి అందించే ‘ఎల్ ఆర్డర్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్ (ద నైట్ ఆప్ ద ఆర్డ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్)’ అవార్డును కమల్ కి అందజేయనున్నట్లు పేర్కొంది.
ఈ అవార్డుల్లో భాగంగా మూడో గ్రేడ్ కు చెందిన చెవాలియర్ (నైట్ యోధుడు) పురస్కారానికి కమల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు కమల్ ఎంపిక పట్ల భారతీయ సినీ పరిశ్రమ హర్షాతికేకం వ్యక్తం చేసింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులే కాకుండా రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల నుంచి కూడా కమల్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు అందిన ఈ అవార్డును తన మార్గదర్శకులు, అభిమానులకు అంకితమిస్తున్నట్లు కమల్ ప్రకటించాడు.
ఇంతవరకు ఈ అవార్డు భారత్ తరపున అమితాబ్ బచ్చన్, నందితా దాస్, షారూఖ్ ఖాన్ లు అందుకోగా, కోలీవుడ్ నట దిగ్గజం శివాజీ గణేషన్ తర్వాత కమల్ ఈ అవార్డు అందుకోబోతున్న రెండో వ్యక్తి కావటం విశేషం. తన నటనతో దక్షిణ భారతాన్నే కాకుండా యావత్తు దేశాన్ని ఆకట్టుకున్న తమిళ నటుడు కమలహాసన్... ఈ అవార్డులతో యూనివర్సల్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. భారతీయ చలన చిత్రరంగంలో సుదీర్ఘ కాలంగా తనదైన నటనతో రాణిస్తున్న కమల్... తాజాగా ఈ ఫ్రెంచి పురస్కారం ఎంపిక కావటం పట్ల తెలుగు విశేష్ ఆయనకు కంగ్రాట్స్ చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more