actress kajal agarwal heart sings marriage song

Kajal agarwal eyeing for marriage soon

Kajal Agarwal, marriage plans, postpone, love proposal, tollywood, kollywood, samantha, solo song for marriage

actress kajal agarwal heart sings solo marriage song, as she postpones marriage proposal as she gets unlimited offers from tollywood and bollywood.

ప్రేమకు వేళాయరా..! అంటూ కాజల్ సోలో సాంగ్.. !!

Posted: 09/03/2016 11:39 AM IST
Kajal agarwal eyeing for marriage soon

ప్రేమకు వేళాయరా అంటూ ఇక తాను కూడా ఆ తీయని అనుభవాన్ని చవిచూడాలని ఉవ్విళ్లూరుతున్నట్లు కమ్మిన మాటను చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. తన తరువాత సినీరంగంలోకి వచ్చి.. ఒక హీరోతో ప్రేమాయణం నడిపి.. త్వరలో ఫెళ్లిపీటలు ఎక్కబోతున్న నటిని చూసి కన్నుకుట్టిందో ఏమె తెలియదు కానీ ఇక ఒంటరి జీవితానికి స్వస్తి పలికి ప్రేమ కలాపాలు సాగించాలని భావిస్తుంది నటి కాజల్‌ అగర్వాలే. మార్కెట్ లో తన అభినయానికి మంచి క్రేజ్ వుండటం.. అనూహ్యంగా అవకాశాలు ముంచెత్తడంతో పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకుని బిజీగా నటిస్తున్న కాజల్ ఆలోచనలు తాజాగా మరోసారి ప్రేమపైకి మళ్లినట్లున్నాయి.
 
ఈ మధ్య ఈ బ్యూటీ నోట పదే పదే ప్రేమ మాట వినిపిస్తోంది. ఇటీవల కాజల్ ఒక భేటీలో పేర్కొన్న అంశాలను చూద్దాం. ‘ఆడవారి విషయంలో మగవారి ఆలోచనాధోరణి మారాలి. ఎందుకంటే మహిళలు పురుషులతో సమానంగానే కాదు వారికంటే అధికంగా సంపాదిస్తున్నారు. పాత కాలంలో మాదిరి ఇంటి పనులు చేయాలని మహిళల్ని పురుషులు ఒత్తిడి చేయకూడదు. అంతే కాదు వారూ ఇంటి పనులు చేయాలి. ఇక ప్రేమ విషయానికి వస్తే అది వర్ణించడానికి కాని తీయని అనుభవం. ఇప్పటి వరకూ నేనెవరినీ ప్రేమించలేదు. అయితే ఇక ప్రేమించాలన్న నిర్ణయానికి వచ్చాను.
 
ప్రేమించడానికి ఏ రాజకుమారుడో అక్కర్లేదు. ఎవరైనా నాకు ఆక్షేపణ లేదు. నాకు తగిన జోడీ అయితే చాలు. అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అడగవచ్చు. నా భావాలను అర్థం చేసుకునేవాడై ఉండాలి. నా ఆలోచనలు గౌరవించాలి. నాపై పూర్తిగా నమ్మకం ఉంచాలి. తను సొంత జీవితం కంటే నా జీవితానికి ప్రాముఖ్యతనివ్వాలి. నా అవసరాలను పూర్తి చేయాలి. అలాంటి వ్యక్తినే నేను ప్రేమిస్తాను. నేనూ సాధారణ అమ్మాయినే. నాకూ కలలు, కోరికలు ఉంటాయి కదా’ అన్న కాజల్ తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో దు మ్మురేపారంటున్నాయి సినీ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  marriage plans  postpone  love proposal  tollywood  

Other Articles