వివాదాలు ఆమె పేరు వింటే చాలూ చుట్టుముడతాయి , అయినప్పటికీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోదు. తాను చేస్తున్న క్యారెక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అదే లక్ష్యంగా పని చేస్తుంటుంది. ఆమె ఎవరో కాదు. బహుభాషా నటి రాధికా ఆప్టే. ఈ రోజు ఆమె 31వ పుట్టిన రోజు ఈ సందర్భంగా తెలుగు విశేష్ తరపున బర్త్ డే విషెష్ తెలియజేస్తూ రాధికా గురించి కొన్ని విషయాలు...
రాధికా ఆప్టే 1985 సెప్టెంబర్ 7 న మహారాష్ట్రలోని పుణేలో జన్మించింది. సహ్యద్రి ఆస్పత్రుల యాజమాని డాక్టర్ చారుదత్ కూతురు. స్కూల్ డేస్ నుంచే నటన మీద మక్కువ పెంచుకున్న రాధిక నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 2005 లో వచ్చిన వాహ్ లైఫ్ హో తో ఐసీ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసిన రాధిక, 2009 లో బెంగాలీ చిత్రం అంతాహీన్, మరాఠీ చిత్రం సమంతార్ తో పూర్తిస్థాయి హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు విషయానికొస్తే 2010 రక్త చరిత్రతో పరిచయమై ప్రకాశ్ రాజ్ ధోనీ, బాలయ్య సరసన లెజెండ్, లయన్ లో నటించి మెప్పించింది. హిందీలో బద్లాపూర్, అడల్ట్ కామెడీ హాంటర్, మాంఝీ, ఫోబియా లతో మంచి గుర్తింపు సాధించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏకంగా రజనీకాంత్ కబాలిలో నటించే ఛాన్స్ కొట్టేయటంతోపాటు, తన కెరీర్ లో మరిచిపోలేని హిట్ అందుకుంది.
ఇక రాధికా కి స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్.. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అని తేడా లేదు. ఎక్కడ ఛాన్స్ వస్తే చాలూ అక్కడ జీవించేయడం ఆమెకు అలవాటు. ది కాలింగ్, ‘అహల్య’ ‘కృతి’ వంటి షార్ట్ ఫిల్మ్స్ ఆమె కెరీర్ కు చాలా ఉపకరించాయి. వివాదాలు ఆమెకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఫేక్ నగ్న ఫోటోలు, సినిమాలకు సంబంధించి న్యూడ్ సీన్ లీకులు ఆమెను ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించినా అవి ఆమె కెరీర్ ను పైకి తీసుకెళ్లేందుకే చాలా ఉపకరించాయి.
రాధిక వ్యక్తిగత జీవితానికొస్తే లండన్ లో సంవత్సరం పాటు నటనలో ట్రెయినింగ్ లో ఉండగా బ్రిటీష్ సంగీత దర్శకుడు బెనెడిక్ట్ టేలర్ ను వివాహం చేసుకుంది. ‘కెమెరా ముందు నిలబడాలి, నటించాలి. అంతేతప్ప అది ఏ స్థాయి సినిమా అన్నది ఆలోచించకూడదు ’ అన్న మాటలతో రాధికా ఆప్టే ఏ స్థాయి నటి అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more