అక్కినేని వారసుల్లో అఖిల్ గురించి తండ్రి నాగ్ ఉన్నంత ఫుల్ క్లారిటీని పెద్ద కొడుకు చైతూ విషయంలో మాత్రం మెయింటెన్ చేయలేకపోతున్నారు. ప్రేమ, పెళ్లి వ్యవహారంపై మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నా... పబ్లిక్ గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా... ఇంత హడావుడి జరుగుతున్నా సమంత పేరు చెప్పడానికి మాత్రం అక్కినేనివారికి నోట మాట రావటం లేదు. ఆ మధ్య నిర్మలా కాన్వెంట్ ప్రమోషన్ లో పెళ్లిపై కొడుకులిద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టుకుని స్వయంగా ప్రకటిస్తానని చెప్పిన నాగార్జున వారి పేర్లను చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు.
పైగా అందరికీ తెలిసిందే కదా హ..హ..హ... అంటూ తన స్టైల్లో నవ్వేస్తున్నాడు. ఇదే టైంలో చైతూ మీడియాకు దొరక్కుండా తిరుగుతున్న చైతూ ఎట్టకేలకు చిక్కాడు. సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ కు సంబంధించి టాలీవుడ్ థండర్స్ జట్టుకు నాగ చైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు పరిచయ కార్యక్రమం చెన్నైలో జరగ్గా, మీడియా పెళ్లి గురించి ప్రశ్నల వర్షం కురిపిచింది. దీంతో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసుకున్నాడు.
వచ్చే ఏడాది తన వివాహం జరుగుతుందని చైతూ తెలిపాడు. పెళ్లికూతురు సమంతనే కదా? అని మీడియా ప్రశ్నించగా, మీరే చెప్పారు కదా ఇక నేనేందుకు చెప్పటం అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు.. అయితే, వివాహానికి డేట్ మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పాడు. తన తండ్రి ప్రెస్ మీట్ నిర్వహించి చెబుతాడు కదా అన్న చందంగానే మాట్లాడాడు కూడా. ఇక, వీరి పెళ్లి జరుగుతుందని తెలిసినప్పటికీ, ఎప్పుడన్న విషయంలో మాత్రం ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో చై స్టేట్ మెంట్ తో దానికి ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more