సల్మాన్-సమీలకు ఎంత తేడా ఉందో... | Adnan Sami hails surgical strikes MNS siva sena slams Salman

Adnan sami hails surgical strikes mns siva sena slams salman

Adnan Sami hails surgical strikes, Adnan Sami-Salman Khan, MNS siva sena slams Salman, Salman Khan Pak actors, Sonakshi Sinha not Pak Journalist, Sami vs Salman

Adnan Sami hails surgical strikes MNS siva sena slams Salman khan.

బాలీవుడ్ లో సీన్ ఇలా రివర్స్ అయ్యింది

Posted: 10/01/2016 03:12 PM IST
Adnan sami hails surgical strikes mns siva sena slams salman

సరిహద్దు అంశం బాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితులకు వేదికగా మారింది. ఇండియా సర్జికల్ స్ట్రైక్ అనంతరం -యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశం మొత్తం సైన్యంకి మద్ధతుగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తోంది. అందులో సెలబ్రిటీలు ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారైతే సత్తా చాటిన సైన్యమే రియల్ హీరోలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగానే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి.

పాక్ నటీనటులంతా తిరిగి భారత్ కి వచ్చేయాలంటూ వ్యాఖ్యానించడటంతో దుమారం రేగింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ 48 గంటల అల్టిమేటం ఇచ్చిన ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ సేన) అయితే తీవ్ర స్థాయిలో మండిపడింది. వాళ్లకు(సల్మాన్ ను ఉద్దేశించి) మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ల సినిమాలను కూడా నిషేధిస్తామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ థాక్రే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.  సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ లాంటివాడని, దానిలాగే బుర్రపనిచేయదని అన్నారు. లేకపోతే దేశం మొత్తం పాకిస్థాన్ తీరును తప్పు పడుతుంటే, నటీనటులను వేరుగా చూడాలని సల్మాన్ అంటున్నాడని మండిపడ్డారు. 'కళాకారులకు బౌండరీలు ఉండవని సల్మాన్ అంటున్నాడు. ఏం కళాకారులేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? వారికి వీసాలు, పాస్ పోర్టులతో సంబంధం లేదా?' అని ఆయన నిలదీశారు.

భారతీయుల కష్టార్జితాన్ని తింటున్న ప్రతి ఒక్కరికీ ఇది ఫ్యాషన్ అయిపోయిందని ఆయన మండిపడ్డారు. సరిహద్దుల్లోని మన సైనికులకు, పాకిస్థాన్ సైనికులకు మధ్య కూడా వ్యక్తిగత విరోధం లేదని, అలా అని వారు పహారా కాయడం మానేస్తే సల్మాన్ ఖాన్ క్షేమంగా ఉంటాడా? అని ఆయన నిలదీశారు. సల్మాన్ మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. లేని పక్షంలో సల్మాన్ అభిమానులే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

ఇంకోవైపు శివసేన నేత మనీషా కాయండే కూడా సల్మాన్ పై విరుచుకుపడింది. మన దేశంలో నటీనటులకు కొరతగా ఉందా అని ప్రశ్నించారు. అసలు పాకిస్థానీ నటులు మన సినిమాల్లో పనిచేయాల్సిన అవసరం ఏముందో తనకు అర్థం కావడం లేదన్నారు. మన కోసం జవాన్లు సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని.. వాళ్లంతా ఆయుధాలు కింద పడేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మన సరిహద్దులను కాపాడేది ఎవరు.. సల్మాన్ ఖానా అంటూ ప్రశ్నించాడు. అసలు దేశం ముఖ్యమన్న విషయాన్ని వీళ్లంతా గుర్తించాలని చెప్పుకొచ్చాడు.

పాక్ దాడిపై సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా... బాలీవుడ్ సింగర్, పాక్ దేశస్థుడు అద్నాన్ సమీ(ఇప్పుడు మన దగ్గర సెటిల్ అయ్యాడు లేండి) భారత్ చేసిన దాడులకు మద్ధతుగా తన ట్విట్టర్ లో కామెంట్లు చేశాడు. ఆ వెంటనే పాక్ నుంచి పెద్ద ఎత్తన్న విమర్శలు రాగా, 'నా వ్యాఖ్యలపై పాకిస్తానీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వారి విమర్శల ద్వారా వాళ్లు పాకిస్తాన్, టెర్రరిజం రెండింటినీ ఒకటే అని భావిస్తున్నారని అనిపిస్తోంది' అంటూ మరో ట్వీట్ చేశాడు. కాగా, పాక్ లో పుట్టిన అద్నాన్ అక్కడ గుర్తింపు లభించకపోవటంతో ఇండియాకు వచ్చాడు. ఇక్కడ పేరు, అవకాశాలు వస్తుండటంతో భారతీయ పౌరసత్వం కూడా తీసుకున్నాడు కూడా.

సోషల్ మీడియాలో ఈ ఇద్దరి వ్యాఖ్యలను పోలుస్తూ ఎంత తేడా ఉందో అంటూ... నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఇక నూర్ చిత్రంలో పాక్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుందన్న వార్తలు రాగానే నటి సోనాక్షి సిన్హాపై విమర్శలు మొదలయ్యాయి. దాంతో రంగంలోకి దిగిన ఆ బ్యూటీ అదంతా ఉత్తదేనని ప్రకటించింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman Khan  Adnan Sami  MNS  Siva Sena  India  Pak  Surgical Strikes  Bollywood  

Other Articles