మోనార్క్ కి కాలింది.. ఇంటర్వ్యూ మధ్యలో లేచివెళ్లిపోయాడు | Prakash Raj got angry for Cauvery Issue in middle of an interview and left

Anger prakash raj left in middle of an interview

Prakash Raj Interview, Prakash Raj left Interview, Prakash Raj angry on Kannada Channel, Prakash Raj angry on media, Prakash Raj Angry with Cayvery Question, Prakash Raj lost his coolness

Prakash Raj is known for his high temper and straight forwardness. Recently Mana Oori Ramayanam Interview A kannada lady anchor asks about Caucery Issue, Raj gets angry and leave in the middle of Interview.

ప్రకాశ్ రాజ్ కి అంత బలుపా?

Posted: 10/03/2016 10:25 AM IST
Anger prakash raj left in middle of an interview

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ది చాలా డిఫరెంట్ మెంటాలిటి. సూటిగా మాట్లాడమే కాదు.. కాస్త అహం, గర్వం కలగలసిన మనిషిగా ఆయనను పేర్కొంటూ వుంటారు. షూటింగులో కూడా అలాంటి టెంపర్ మెంట్ చూపించిన సందర్భాలు కూడా వున్నాయి. దర్శకుడు శీనువైట్లతో, కృష్ణవంశీతో జరిగిన వ్యవహారాలే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా ఓ కన్నడ టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ మధ్యలో ఆగ్రహంతో ఊగిపోతూ విసవిసా లేచివెళ్లిపోవడం ఇప్పుడు సెన్సేషన్ అయింది.

తాజాగా తను నిర్మించిన 'మన ఊరి రామాయణం' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రకాశ్ రాజ్ బిజీగా వున్నాడు. ఈ క్రమంలో పలు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

అందులో భాగంగా ఓ కన్నడ టీవీ చానల్ కి కూడా ఇచ్చాడు. ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నట్టుండి టీవీ యాంకర్ కావేరీ నీళ్ల వివాదం విషయంలో ఆయన స్టాండ్ గురించి ప్రశ్నించింది. అంతే ...

పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతూ 'సినిమాకీ, దీనికీ సంబంధం ఏమిటి?' అంటూ ఇంటర్వ్యూ మధ్యలో లేచివెళ్లిపోయాడు. అంతేకాదు, ఇకపై మరెప్పుడూ తన వద్దకు ఇంటర్వ్యూకు రావద్దంటూ సదరు టీవీ ఛానెల్ సిబ్బందికి ప్రకాశ్ రాజ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. కాగా, గతంలోనే నీటి కోసం రక్తం పారించొద్దు అంటూ ఇరు ప్రాంతాల ప్రజలను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ఓ వీడియో రూపంలో తన సందేశాన్ని ఉంచిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Prakash Raj  Interview  Mana Oori Ramayanam  Kannada Anchor  Cauvery Issue  Angry  Left  

Other Articles