బిచ్చగాడు హీరో హిందువుల మనోభావాలు దెబ్బతీశాడా? | Bethaludu Movie Teaser Hurt Hindus

Bethaludu movie teaser hurt hindus

Bethaludu Trailer removed, Bethaludu Movie Teaser Hurt Hindus by using Vedas, Vijay Antony sorry to Pandits, Vijay Antony Saitan Controversary, Bichadu replace anthor Trailer, Bethaludu second Trailer

Bethaludu Movie Teaser Hurt Hindus by using Vedas Chant.

బిచ్చగాడు హీరో మనోభావాలు దెబ్బతీశాడా?

Posted: 10/05/2016 02:46 PM IST
Bethaludu movie teaser hurt hindus

బిచ్చగాడిగా నటుడు విజయ్ ఆంటోనీ హవా అయిపోయింది. ఇప్పుడు భేతాళుడిగా మరో డిఫరెంట్ సబ్జెక్టుతో మన ముందుకు రాబోతున్నాడు. ఇంకా బిచ్చగాడు హీరో అని చెప్పటం ఏంటి అనుకుంటున్నారా? ఏదో ఇంట్రో కోసం వాడుకున్నాం. ఇప్పుడు చెప్పబోయేది భేతాళుడికి సంబంధించిన విషయమే. ఇంతకీ విజయ్ ఎవరి మనోభావాలు దెబ్బతీశాడనేగా మీ అనుమానం.

తాజాగా భేతాళుడు(తమిళ్ లో సైతాన్) టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. స్టన్నింగ్ విజువల్స్ తోపాటు కూడిన వీడియోలో ఢిఫరెంట్ పాత్రలతోపాటు, బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా దుమ్మురేపాడు విజయ్ ఆంటోనీ(సంగీత దర్శకుడు కూడా). అయితే ఆ మ్యూజిక్ మీదే ఇప్పుడు కంప్లైంట్ లు అందుతున్నాయి. ప్రారంభంలో తాంత్రియా ఉపనిషత్ లోని వేద మంత్రాలతో ఈ వీడియో ప్రారంభమౌతుంది. దీంతో తమను అవమానిస్తున్నాడంటూ వేద పండితులు కొందరు ఫిర్యాదులు చేశారు.

ఈ విమర్శలు తారాస్థాయికి చేరటంతో విజయ్ ఆంటోనీ తన ట్విట్టర్ అకౌంట్లో క్షమాపణలు తెలిపాడు. తొలుత విడుదల చేసిన టీజర్ ను తొలగించడమే కాదు... మార్పులతో మళ్లీ కొత్త టీజర్ ను రిలీజ్ చేస్తానని ప్రకటించాడు కూడా. ఈరోజు సాయంత్రం 7 గంటలకే దానిని విడుదల చేస్తాడంట. ఇక ఈ భేతాళుడు రెండు భాషల్లో ఒకేసారి దీపావళికి విడుదల చేయనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Antony  Sorry  Hindus  Bethaludu  Saitan  Teaser  

Other Articles