సర్జికల్ దాడులపై 25 రోజుల్లో సినిమా | Gurmeet Ram Rahim Singh to Make a Film on Surgical Strikes within 25 days

Gurmeet ram rahim singh announced movie on surgical strikes

Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh, Gurmeet Ram Rahim Singh surgical strikes, Gurmeet Ram Rahim Singh next movie, movie on surgical strikes within 25 days, Messenger of God hero movie on Surgical Strikes

Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh is set to make a film on surgical strikes within 25 days.

వారీ దేవుడా!... సర్జికల్ స్ట్రైక్స్ పై సినిమానా?

Posted: 10/20/2016 01:00 PM IST
Gurmeet ram rahim singh announced movie on surgical strikes

అవునండీ. యూరీ దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర శిబిరాలను, 38 మంది ఉగ్రవాదులను కేవలం 48 నిమిషాల్లోనే మట్టుపెట్టింది మన సైన్యం. మరి అంతటి గొప్పను సినిమా తీయొద్దా అంటున్నాడు డేరా సచ్ఛ సౌధా చీఫ్ గురుమీత్ రామ్ రహీమ్ సింగ్. ఈయనే ఎవరో తెలుసు కదా?!

ఆధ్యాత్మిక గురువు అయిన ఈయనగారు గతంలో మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటూ ఓ సినిమాను తీశాడు. పనికిరాని సన్నివేశాలు, యాక్షన్ లతో ఆ చిత్రం జనాలను బాగా టార్చర్ పెట్టింది. ఆపై దానికి కొనసాగింపు సినిమాలు తీసి జనాల మీదకు వదులుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా సర్జికల్ స్ట్రైక్స్ పైనే సినిమా తీసేందుకు సిద్ధమైపోతున్నాడు. దానికి టైటిల్ కూడా పెట్టేశాడండోయ్... ఎంఎస్ జీ -ది లయన్ హార్ట్- హింద్ కా నాపాక్ కో జవాబ్.

ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సినిమా ఉంటుంది. మన జవాన్లను కోల్పోయి దేశం బాధలో ఉంటే, సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను బయటపెట్టాలని కొందరు కోరుతున్నారు. అది నన్ను బాధించింది. వారికి సమాధానంగానే ఈ సినిమా ఉంటుంది. 25 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేస్తాం అంటూ సింగ్ వివరించాడు. మాములుగానే సిత్రాలు చూపే ఈ సింగ్ జీ ఈ దాడులను ఎంత భీకరంగా చూపుతాడో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dera Sacha Sauda chief  Gurmeet Ram Rahim Singh  Movie  surgical strikes  

Other Articles