బాహుబలి ది బిగినింగ్ బిగ్గెస్ట్ మిస్టేక్ | rajamouli confess wrong about cameo in Baahubali.

Rajamouli confess about cameo in baahubali

Rajamouli speech at Baahubali 2 Prabhas's Firstlook, Rajamouli did mistake with cameo in Baahubali, Rajamouli never make cameo in his movies,

Rajamouli speech at Baahubali 2 Prabhas's Firstlook. Confess his big mistake did cameo in Baahubali.

బాహుబలి పార్ట్ 2 లో మళ్లీ పొరపాటు చేయను

Posted: 10/24/2016 02:20 PM IST
Rajamouli confess about cameo in baahubali

బాహుబలి సినిమాలో తాను గెస్ట్ రోల్ లో కనిపించి చాలా పెద్ద తప్పు చేశానని, పార్ట్ లో మాత్రం తాను అలాంటి పని చేయబోనని తెలిపాడు డైరక్టర్ రాజమౌళి. శనివారం ఫస్ట్ లుక్ లాంఛ్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు రాజమౌళి చాలా కూల్ గా సమాధానమిచ్చాడు.

'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అన్న అంశం ఇంత పెద్ద సెన్సేషన్‌ అవుతుందని తాము ఊహించలేదని చెప్పాడు. రెండో పార్టుపై ఆసక్తిని కొనసాగించడానికే ఈ అంశాన్ని సస్పెన్స్‌గా ఉంచామని తెలిపాడు. "కట్టప్ప ఇంత పాపులర్‌ అవుతున్నాడని మేం ఊహించలేదు. మొదటి భాగానికి ఇది సరైన ముగింపుగా భావించాం. కానీ ఇది (కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న) ఇంత పెద్ద అంశం అవుతుందని మేం ఊహించలేదు' అని రాజమౌళి వివరించాడు. ఈ విషయంలో ఇంత ఆసక్తిగా నెలకొనడం ఆనందం కలిగిస్తున్నదని చెప్పారు. అదే సమయంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఎవరైనా సరిగ్గా చెప్పగలిగారా? అంటే లేదని బదులిచ్చారు.

భవిష్యత్తులో హిందీ సినిమాలను దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిపిన రాజమౌళి. బాహుబలికి బాషాంతరాలు లేకపోవటం కలిసొచ్చిందని అది అన్నివేళలా సాధ్యపడదని చెప్పుకొచ్చిన జక్కన్న, తన కథ అన్ని వర్గాలకు నచ్చేలా ఉండటంపైనే తన బాలీవుడ్ డెబ్యూ ఆధారపడి ఉంటుందని తెలిపాడు.

ఇక అత్యద్బుతమైన టెక్నికల్ నాలెడ్జ్ ని ఉపయోగించి సినిమాను తెరకెక్కించి, హిట్ కొట్డడంలో దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిది పండిపోయారు. ఆ మధ్యన వచ్చిన ఈగ, రీసెంట్ గా వచ్చిన 'బాహుబలి' తెలుగు సినీ చరిత్రలో అద్భుత విజువల్‌ వండర్‌గా నిలిచిపోయాయి. హాలీవుడ్ లో 'అవతార్‌' కోసం జేమ్స్‌ కామెరాన్‌ ‌ పాండోరా గ్రహాన్ని సృష్టిస్తే.. 'బాహుబలి' కోసం రాజమౌళి 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇప్పుడు మరో అడుగుముందుకు వేసి వర్చువల్‌ రియాల్టీ(వీఆర్‌)ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు జక్కన్న. ఈ వీడియోని చూస్తే రాజమౌళి వూహా ప్రపంచం ఇలా ఉంటుందా? అని ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్కో పాత్ర మాషిష్మతి గురించి చెబుతూ ఉండే ఆ వీడియోను మరి మీరు ఓ లుక్కేయండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Prabhas Poster launch  prabhas speech  

Other Articles