పెద్ద నోట్ల రద్దు రజనీనే ముందు చెప్పాడు బాస్ | Rajni Shivaji post versus Bichagadu post.

Boss says it long ago before bichagadu

Bichagadu post, Rajnikanth shivaji post, Shivaji Currency post, Bichagadu currency post, Currency post from movies, Rajnikanth Vijay antony and Nara Rohit

Rajnikanth says about currency ban before Bichagadu, post viral now.

చెప్పింది బిచ్చగాడు కాదు సూపర్ స్టార్

Posted: 11/10/2016 01:57 PM IST
Boss says it long ago before bichagadu

ఒక్క టాలీవుడ్ నే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన నిర్ణయం టోటల్ ఇండియా చలన చిత్ర పరిశ్రమనే తీవ్రంగా ప్రభావం చూపనుంది. కొత్తగా రిలీజ్ కావాల్సిన చిత్రాల దగ్గరి నుంచి సెట్స్ లో ఉన్నవీ, అల్రెడీ కమిట్ అయిన సినిమాలు, ముఖ్యంగా అగ్రహీరోల భారీ బడ్జెట్ చిత్రాలపై ఈ ఎఫెక్ట్ పడబోతుంది. ఈ డెసిన్ పై అన్నివర్గాల నుంచి రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సీరియస్ టాప్ అయినప్పటికీ సిల్లీ జోకులతో సోషల్ మీడియా మొత్తం నింపేస్తున్నారు.

అందులో మచ్చుకు ఒకటి ఏంటంటే... తమిళంలో పిచ్చికారన్ (తెలుగులో బిచ్చగాడు) అనే ఓ హిట్ సినిమా ఉంది కదా. ఆ సినిమాలో ‘అవినీతి నిర్మూలన’ గురించి ఓ ఎఫ్‌ఎం స్టేషన్‌లో చర్చ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మన బిచ్చగాడు ఫోన్‌ చేసి అవినీతిని నిర్మూలించాలంటే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని సూచిస్తాడు. తన వాదనను ఉదాహరణలతో సహా వివరిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

అయితే మిగతా ఫ్యాన్స్ ఏమైన్న తక్కువ తిన్నారా? అది మా హీరో పనంటే.. మా హీరో పనే అని భుజాలు చరుచుకుంటున్నారు. ఇందులో తలైవా రజనీకాంత్ అభిమానులు కూడా ఏం తక్కువ కాలేదు. అసలు ఆ ఐడియా రజనీకి ఏడేళ్ల క్రితమే వచ్చిందంట. దీనికి ఆధారాలతో సహా చూపిస్తున్నారు అభిమానులు. విషయం ఏంటంటే.. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన శివాజీ సినిమా గుర్తుంది కదా. ఆ సినిమా ఎండ్ కార్డులో ఓ పోస్టర్ ఉంటుంది. అంతే 500, 1000 నోట్ల రద్దు సూపర్ స్టార్ పనేనంటూ పోస్టులు చేసేస్తున్నారు.

Shivaji 500 and 1000 notes

మరి టాలీవుడ్ జనాలు ఊరుకుంటారా చెప్పండి. నారా రోహిత్ ప్రతినిధి సినిమాలో ఓ సీన్ ను పోస్ట్ చేసేస్తున్నారు. మంచోడు శీను సీఎం కిడ్నాప్ తర్వాత పెద్ద నోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేయటం, అవసరమైతే నోటును ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు కాబట్టి గాంధీ బొమ్మ తీసేయాలంటూ కోరటం కూడా అందులో ఉంటుంది. ఎప్పట్నుంచో ఈ డిమాండ్‌ ఉన్నప్పటికీ ప్రధాని ఉన్నట్టుండి అందిరికీ షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకోవడంపై సోషల్ మీడియాలో ఇలా పోస్టులు వెల్లువల్లా వస్తూనే ఉన్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rajnikanth  Shivaji movie  Bichagadu  Currency posts  

Other Articles