బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జాతో కలసి చిందులేశాడా..? ఇది నిజమేనా.. అసలు సానియా చిత్రాలలో నటించడం ఎప్పడ్నించి ప్రారంభించింది. శీర్షక చూడగానే మీ మదిలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ.. కానీ ఇది నిజం సల్మాన్ అటు బాలీవుడ్ అందాల బామ పరినితి చోప్రాతో ఇటు సానియా మిర్జాతో కలసి స్టెపులేసి అదరగోట్టాడు. ‘బేబీకో బేస్ పసంద్ హై...’ అన్న ‘సుల్తాన్’ సినిమాలో సాగే పాటకు సల్మాన్ కి తోడుగా సానియా స్టెప్స్ వేసి అలరించారు.
సిటీకి చెందిన కొందరికి మాత్రం ఆ అదృష్టం దక్కింది. ఇంతకీ ఎక్కడా..? విశేషమేంటని అడుగుతున్నారు కాదూ. టెన్నిస్ సంచలనం సానియా మిర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ఈ సంగీత్ లో పాల్గొని స్టెపులేశారు. అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సానియా టెన్నిస్ రాకెట్తోనే కాదు డ్యాన్సులతోనూ మెరపించగలనని నిరూపించారు. గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరిగిన ఈ సంగీత్ విశేషాల గురించి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన ట్విస్ట్ అండ్ టర్న్ సంస్థ కొరియోగ్రాఫర్ ఆర్యన్ మీడియాతో పంచుకున్నారు.
‘ఏడేళ్లుగా సానియా కుటుంబంతో పరిచయం ఉంది. పెళ్లికి ముందే నా స్నేహితుల ద్వారా ఆమె నాకు పరిచయం. చాలా మంది సెలబ్రిటీలతో పోలిస్తే సానియా బాగా డౌన్ టు ఎర్త్. ఒకప్పుడు అసలు వరల్డ్ చాంపియన్ తో మాట్లాడడమే గొప్ప అనుకున్నాం. అయితే ఆమె మాతో పక్కింటి అమ్మాయిలా ఉండడం మరింత ఆశ్చర్యం. సానియా, ఆనమ్మీర్జా ఇద్దరి పెళ్లి సంగీత్లకు కొరియోగ్రఫీ అందివ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవం. సానియా చాలా పెద్ద స్టార్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఓ గొప్ప ఫ్యామిలీ పర్సన్ అని సన్నిహితంగా మెలిగే వాళ్లకు మాత్రమే తెలుసు. ఇక ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒకరి గురించి ఒకరు అన్నట్టుంటారు. ఈ పెళ్లికి మొత్తం సానియానే పెద్దయ్యారు. చెల్లెలి కోసం సానియా స్వయంగా శ్రమపడి ఎన్నో రెడీ చేశాను అని అర్యన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more