నాగ చైతన్య పుట్టిన రోజు అసలు ఏం జరిగింది? | Samantha Dance at Naga Chaitanya's birthday party.

Samantha enjoy naga chaitanya birthday party

Samantha, Naga Chaitanya, Samantha Instagram, naga chaitanya birthday, Naga chaitanya's Birthday, Sam dance at Chay birthday

Samantha posted photo how she enjoyed in Naga Chaitanya's birthday party.

సమంత, చై అంతలా రెచ్చిపోయారా?

Posted: 11/26/2016 03:52 PM IST
Samantha enjoy naga chaitanya birthday party

అక్కినేని వారసుడు నాగచైతన్య.. చెన్నై డాల్ సమంతలు పెళ్లి పీటలెక్కబోవడం ఖాయం అయింది. చిన్నగా లీకులు ఇవ్వటం దగ్గరి నుంచి మొదలైన వీరి ప్యార్ కహానీ మెల్లిగా ఓపెన్ చేసి మీడియా ముందు పెట్టేశారు. ఆపై సీక్రెట్ నుంచి ఓపెన్ గానే జంటగా కనిపిస్తూనే ఉన్నారు. నాగార్జున స్వయంగా ప్రకటన ఇచ్చాక బహిరంగంగానే చైతూ, సమంత అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

ఇటీవల చైతూ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ ఏకాంతంగా ఉన్న ఫొటోను కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆపై చైతూ బర్త్ డే అయిపోవటం, వాళ్లు ఏం చేశారో అన్న అప్ డేట్ లేకుండా పోయింది. దానిపై క్లారిటీ ఇస్తూ ఇప్పుడు మరో పిక్ పెట్టేసింది. చై బర్త్ డే సందర్భంగా ఓ పార్టీ ఏర్పాటు చేసిన ఈ జంట అక్కినేని గ్యాంగ్ తో చిందులేసింది. వీరిద్దరూ డాన్స్ ఫ్లోర్ పై ఉన్న ఓ ఫోటోను తన ఇన్ స్టాలో పెట్టేసింది. సిల్వర్ కలర్ స్వివ్ లెస్ డ్రెస్ చిందులేస్తూ సామ్, వెనకాల వైట్ అండ్ వైట్ లో చైతూ నిల్చున్న ఫోటో అది.

ఎప్పటికీ ఇదే బెస్ట్ వీక్.. కలలో గడిపినట్లుగా ఉంది.. ఫ్యామిలీ.. ఫ్రెండ్స్.. లవ్.. అంటూ శామ్ పెట్టిన హ్యాష్ ట్యాగ్స్ హైలెట్ అయ్యాయి. పార్టీలో విచ్చలవిడిగా చిందేస్తూ మస్తుగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోను సమంత అప్‌లోడ్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయినా ఇప్పుడున్న ఓపెన్ మైండ్ జనరేషన్ కి పెళ్లి కాకముందే ఇలా తిరగటం తప్పని చెబితే వింటారా చెప్పండి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  naga chaitanya  Birthday party  

Other Articles