బాలయ్య మనవడు కాదంట.. మరి? | Kannada star siva rajkumar not grandson of satakarni.

Siva rajkumar role in gsp reveal

Kannada Hero, Sivaraj Kumar, Gautamiputra Satakarni, Balayya, Siva Rajkumar role, Siva Rajkumar in GSP, Balayya GSP date, siva rajkumar Satakarni, Balayya 100th movie

Kannada Star Hero Siva Rajkumar role revealed in Balayya's Gauthami Putra Satakarni.

సూపర్ స్టార్ రోల్ పై క్లారిటీ

Posted: 11/29/2016 10:24 AM IST
Siva rajkumar role in gsp reveal

ఓ సినిమాకు హైప్ పెంచేందుకు ఇతర భాషల హీరోలతో రోల్స్ చేయించటం సౌత్ సినిమాల్లో కొనసాగుతున్న ఒకేఒక్క ట్రెండ్. బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి కూడా ఆ జాబితాలో ఉంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హేమా మాలిని, కబీర్ బేడీ వంటి బాలీవుడ్ స్టార్లనే కాదు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను కూడా ఓ పాత్ర కోసం తీసుకున్నారు.

సినిమాలో ప్రారంభ సన్నివేశమే రాజ్ కుమార్ పై ఉంటుందని, శాతకర్ణి మనవడి పాత్రలో ఈ అగ్రహీరో నటించబోతున్నాడని చెప్పుకున్నారు. అయితే ఆ రోల్ ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది. ఓ బుర్రకథ చెప్పే నటుడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడంట. సినిమా ప్రారంభంలో శివరాజ్ కుమార్ శాతకర్ణి గురించి చెప్పే కథతోనే సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. బాలయ్య తో ఉన్న స్నేహంగా కారణంగానే ఈ పాత్రకు ఒప్పుకున్నట్లో ఓ కన్నడ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా శివరాజ్ కుమారే చెప్పాడు.

ఇక అల్రెడీ టాకీ పార్ట్ పూర్తి కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చకచకా జరుపుకోంటోంది. జనవరి 11 2017న ప్రపంచ వ్యాప్తంగా శాతకర్ణి రిలీజ్ కాబోతుందని ఇప్పటికే క్రిష్ అనౌన్స్ చేసేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada Hero  Sivaraj Kumar  Gautamiputra Satakarni  Balayya  

Other Articles