కొత్త సంవత్సరం ముగుస్తోంది. ఈ యేడాది తెలుగులో వందకు పైగే సినిమాలు వచ్చాయి. అందులో దాదాపు ఓ 20 దాకా భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. సైలెంట్ గా వచ్చి హిట్లు కొట్టినవి డజనుపైనే. అదే సమయంలో కొలుకొలేని డిజాస్టర్లను కూడా టాలీవుడ్ చవి చూసింది. మరి ఈ యేడాది హీరోలలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు?. వారి ర్యాంకులేంటో ఇప్పడు చూద్దాం.
నెంబర్ వన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నెంబర్ టూ ప్రిన్స్ మహేష్ బాబు, నెంబర్ త్రీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నెంబర్ ఫోర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నెంబర్ ఫైవ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... సిక్స్ వన్ కళ్యాణ్... ఈ ఏడు టాలీవుడ్ నటుల్లో ఎవరికోసం ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారన్న దానిపై గూగుల్ ఇలా ర్యాంకులు విడుదల చేసింది. ఇక సమంత, నాగ చైతన్యల ప్రేమ వ్యవహారంతో హాటెస్ట్ కపుల్ గా వారు నిలిచారు. జనసేన మీటింగ్ లతో పవన్ సినిమాల కంటే ఎక్కువ ట్రెండ్ కావటం విశేషం.
వరుసగా యాభై కోట్ల బ్లాక్ బస్టర్లు అందిస్తూ.. ఈ యేడాది సరైనోడుతో సాలిడ్ హిట్ కొట్టాడు బన్నీ. ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా ట్విట్టర్ లో ప్రవేశించిన అల్లు అర్జున్ అతితక్కువ సమయంలో మిలియన్ అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడు గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుడిగా అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. కాగా, బన్నీకి కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా మలయాళంలో విశేషమైన ఆదరణ ఉంది. ఆ తర్వాత మహేష్, బాహుబలితో ప్రభాస్, ఎన్టీఆర్, రాం చరణ్, పవన్ కళ్యాణ్ లు నిలిచారు.
ఎవరికి వారే తోపులు...
ముందు ఈ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలిచాడని వార్తలొచ్చాయి. దీంతో నందమూరి అభిమానులు రెచ్చిపోయారు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ అభిమానులు లైన్లోకి వచ్చారు. ఎన్టీఆర్ కాదు.. బన్నీనే మోస్ట్ సెర్చ్డ్ హీరో అంటూ హంగామా చేశారు. ఎన్టీఆర్ అనే పదంతో వెతికినపుడు ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉన్నాడట. బన్నీ రెండో స్థానంలో నిలిచాడు.
మహేష్ బాబు.. ప్రభాస్... రాంచరణ్... పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐతే జూనియర్ ఎన్టీఆర్ అనే పద బంధంతో కలిపి వెతికినపుడు అతడి స్థానం నాలుగుగా ఉంది. అల్లు అర్జున్ అగ్ర స్థానంలో ఉన్నాడట. మహేష్ బాబు రెండో స్థానంలో.. ప్రభాస్.. పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారని అభిమానులు అంటున్నారు. హీరోల అభిమానులు ఎవరి వెర్షన్లు వాళ్లు వినిపిస్తూ మా హీరోనే నెంబర్ వన్ అంటూ మురిసిపోతున్నారు. ఐతే వాస్తవంగా గూగుల్ ప్రకటించిన దాంట్లో మాత్రం బన్నీ పేరే నంబర్ వన్ గా ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more