సంచలనంగా మారిన బాలయ్య ట్రైలర్.. ''రాజసం ఉట్టిపడింది'' Gautamiputra Satakarni theatrical trailer creates sensation

Gautamiputra satakarni theatrical trailer creates sensation

Gautamiputra Satakarni, Nandamuri Balakrishna, balakrishna 100 movie, balaiah 100th movie, balayya century movies, krish historical movie, first frame entertainments, Gautamiputra Satakarni Official Teaser, Gautamiputra Satakarni First Look, Gautamiputra Satakarni Trailer, tollywood, latest movie news

tollywood yuva ratna nandamuri balkrishna 100th movies theatrical trailer creates sensation as Gautamiputra Satakarni trailer is viewed by nearly 20 lakh people within 24 hours

సంచలనంగా మారిన బాలయ్య ట్రైలర్.. ''రాజసం ఉట్టిపడింది''

Posted: 12/17/2016 04:52 PM IST
Gautamiputra satakarni theatrical trailer creates sensation

నందమూరి బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి ట్రెయిలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ థియేట్రికల్ ట్రెయిలర్ విడుదలై 24 గంటలు కూడా తరిక్కముందే వీక్షకుల సునామీని ఎదుర్కోంటుంది. దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో తెరకిక్కించిన పౌరాణిక చిత్రం.. అందులోనూ బాలకృష్ణ 100వ చిత్రం కావడంతో ఎంతో వ్యయప్రయాలకు ఓర్చి.. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపోందించిన ఈ చిత్రానికి సంబధించిన ట్రెలర్ అంతకంతకూ తన వీక్షకుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంది.

బాలయ్య వందవ చిత్రానికి తెలగు ప్రేక్షకుల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో స్పందన రావడంతో అభిమానులు సంతోషాలకు అవధులు లేకుండాపోయాయి. 24 గంటల వ్యవధిలోనే 20 లక్షల మంది ఈ ట్రైలర్ ను వీక్షించడం గొప్పవిషయంగా చెబుతున్నారు. ఇప్పటివరకూ 19 లక్షల 41 వేల 161 మంది ఈ ట్రైలర్ ను వీక్షించారు. మా జైత్రయాత్రను గౌరవించి.. మీ ఏలుబడిని అంగీకరించి.. మీ వీర ఖడ్గాన్ని మా రాయభారికి స్వాధీనం చేసి.. మాకు సామంతులౌతారని అశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా అంటూ సాగే ట్రైలర్ ఓపెనింగ్ లో బాలయ్య డైలాగులు అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి

ఇక ఇటు దేశభక్తికి కూడా పెద్ద పీట వేసిన చిత్రం అవుతున్న నేపథయంలో అటు దేశభక్తుల్ని కూడా ఈ చిత్రం అలరించనుంది. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి సతీమణిగా శ్రియ, తల్లిగా అలనాటి అందాల నటి హేమామాలిని నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై బాలయ్య అభిమానులకు అంచనాలు అధికంగా వుండగా, ఇక ట్రైలర్ రిలిజ్ కావడం, దానిని వీక్షించేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వం.. చిత్ర టెక్నికల్ టీమ్ టేకింగ్ ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Bala Krishna  Historical Movie  Krish  Theatrical Trailer  

Other Articles