వివాదాల వంగవీటి.. రీషూట్ అయ్యే పనేనా? | Ranga fans demanded Varma for re shoot of Vangaveeti.

Vangaveeti radha warns varma

Vangaveeti Movie, Varma Vangaveeti, Vangaveeti Vangaveeti Movie Political, Vangaveeti re shoot , Vangaveeti Fans Varma, Vangaveeti Radha Krishna Ram Gopal Varma, Vangaveeti Movie, Ranga as Villain in Vangaveeti, Vangaveeti Movie Issue, Vangaveeti Caste issue, CPI Vangaveeti Movie, Vangaveeti Yuvasena Warn

Vangeveeti controversy turns into Political.

వర్మ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

Posted: 12/26/2016 12:46 PM IST
Vangaveeti radha warns varma

వంగవీటితో వార్తల్లో నానుతున్న వర్మ మరిన్ని వివాదాలను మూటగట్టుకుంటున్నాడు. ఓవైపు వారసుడు వంగవీటి రాధా, మరోవైపు రంగ ఫ్యాన్స్ వర్మకు సాలిడ్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. వంగవీటి సినిమాతో వర్మ చరిత్రను వక్రీకరించాడని తనయుడు వంగవీటి రాధాకష్ణ మండిపడ్డాడు. వంగవీటి మోహనరంగా వర్ధంతి సభలో పాల్గొన్న రాధ ఈ సందర్భంగా వర్మపై విరుచుకుపడ్డాడు. అన్ని తెలుసన్న వర్మ రంగ హంతకులు ఎవరో తెలీదనటం ఏంటని ప్రశ్నించాడు. వారు ఇప్పటికీ బయట తిరుగుతున్న విషయం అందరికీ తెలుసని తెలిపాడు.

డబ్బు కోసమే వర్మ ఇలా దిగజారి సినిమా తీశాడని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. తానేం చేయాలో అది చేసి చూపిస్తానని అన్నారు. ఇప్పటికే దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తాను కూడా ఏం చేయాలో చేస్తానని చెప్పారు. రంగా పెళ్లిని చూపించిన తీరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని రంగ యువసేన ప్రతినిధులు వర్మ పై మండిపడ్డారు.

సినిమా రంగా చేసిన సామాజిక సేవలను ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు. వర్మ తీరుతో తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వంగవీటి మోహనరంగా చేసిన సమాజసేవను మళ్లీ చిత్రీకరించి రెండు రోజుల్లో సినిమాను రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఎరుపు ఆగ్రహం కూడా...
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మతిభ్రమించి 'వంగవీటి' చిత్రం తీశాడని విజయవాడ సీపీఐ నేతలు మండిపడ్డారు. ప్రజల కోసం ఎంతో పోరాడి హత్యకు గురైన చలసాని వెంకటరత్నం పాత్రను ఈ చిత్రంలో తప్పుగా చూపారని ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు. వెంకటరత్నాన్ని మద్యానికి బానిసైన వ్యక్తిగా చూపారని, ఆయన్ను కించపరిచేలా చిత్రం ఉందని అన్నారు. చిత్రంపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిని తొలగించకుంటే, వర్మకు బుద్ధి చెబుతామని శంకర్ హెచ్చరించారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vangaveeti Movie  Ram Gopal Varma  Vangaveeti Radha  Warn  Vangaveeti Yuvasena  

Other Articles