ఈ యేడాది ఇండియాలో గూగుల్ సెర్చ్ ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. టోటల్ ఇండియన్ సినిమాలను శాసించే బాలీవుడ్ ను కాదని, టాలీవుడ్ హీరోయిన్ల కోసం అత్యధిక మంది వెతుకులాట చేశారు. ఇది కాస్త అతిశయోక్తి అనిపించినప్పటికీ నిజం. కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్, సమంత వాళ్ల వాళ్ల క్రేజీ ప్రాజెక్టులతో, వ్యక్తిగత విషయాలతో బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలను వెనక్కి నెట్టి మరీ టాప్ లిస్ట్ లో నిలవటం విశేషంగానే చెప్పుకోవచ్చు.
ఇక ఏడాది ముగుస్తోంది కాబట్టి ఎవరెవరికి ఈ యేడాది ఎలా కలిసొచ్చిందో చూద్దాం. నో డౌట్.. ఈ టాలీవుడ్ లో లక్కీ గర్ల్ ఎవరంటే రకుల్ అనే చెప్పాలి. గతేడాది చివర్లో కిక్-2, బ్రూస్ లీ తో రెండు భారీ డిజాస్టర్లు చవిచూసిన రకుల్; ఈ యేడాది మాత్రం నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ మూడు భారీ హిట్లు అందుకుంది. అంతేకాదు మహేష్-మురగదాస్ ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో ఛాన్స్ కూడా కొట్టేసింది. సమంత విషయానికొస్తే... బ్రహ్మోత్సవం పీడకల మిగిలిస్తే.. అ.ఆ.. జనతా గ్యారేజ్ లతో హిట్ లు అందుకుంది. వీరి తర్వాత చెప్పుకోదగింది అంటే హెబ్బా పటేల్ గురించే.. ఈడోరకం-అడోరకం, ఎక్కడికి పోతావ్ చిన్నావాడా సినిమాలతో ఈ కుమారికి బాగానే కలిసొచ్చి లక్కీ ఐకాన్ గా మారిపోయిందీ కుమారి. అయితే చివర్లో మాత్రం నేను నాన్న నా బాయ్ ప్రెండ్ ఫ్లాప్ అయి కూర్చుంది.
మిగతావాళ్ల విషయానికొస్తే... కుర్రహీరోయిన్లు ఆకట్టుకుంటే... సీనియర్ హీరోయిన్లకు అంత కలిసి రాలేదనే చెప్పాలి. ప్రామిసింగ్ ఫేస్ లలో నేను శైలజతో ఫ్రెష్ ఫేస్ గా నిలిచిన కీర్తి సురేష్ యూత్ లో బాగా పాపులారిటీ సంపాదించేసుకోగా, మెహ్రీన్ కౌర్ కృష్ణగాడితో ఆకట్టుకుంది. జెంటిల్మెన్ లో నటనతో నివేదా థామస్ ఆకట్టుకుంది. మజ్నుతో ఇమ్మా ఎమ్మాన్యుయేల్ యావరేజ్ అనిపించుకుంది. మెగా తనయ నిహారిక ఒక మనసులో పాస్ మార్కులు వేయించుకోలేకపోయింది. ఇక ఎక్కడికి పోతావ్ చిన్నవాడలో నందితా శ్వేత దెయ్యం క్యారెక్టర్ తో బాగా దగ్గరయ్యింది. మాంజీమా మోహన్ సాహసం శ్వాసగా.. తో మాయ చేయలేకపోయింది. చాలా మంది డెబ్యూ హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు కూడా.
నిత్యామీనన్ ఒక అమ్మాయి తప్ప, 100 డేస్ లవ్ అట్టర్ ఫ్లాప్ కాగా, జనతా గ్యారేజ్, ఇంకొకడు హిట్ లుగా నిలిచాయి. లావణ్య త్రిపాఠి సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తులతో మరో హిట్లు అందుకుని, లచ్చిందేవికి ఓ లెక్కుందితో డిజాస్టర్ చవిచూసింది. సుప్రీంతో రాశిఖన్నా ఆకట్టుకుని, హైపర్ తో ఫ్లాప్ దక్కించుకుంది.
మరోవైపు సీనియర్ హీరోయిన్లకు మాత్రం ఈ యేడాది అచ్చీరాలేదనే అనుకోవాలి. రమ్యకృష్ణ సోగ్గాడే చిన్నినాయనలో నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. బాబు బంగారంతో నయనతార ఫ్లాప్ అందుకుంటే.. త్రిష నాయకితో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కాజల్ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం నిరాశ పరిచినప్పటికీ, గ్యారేజ్ లో లోకల్ పాపగా అలరించి ఆపై ఏకంగా మెగాస్టార్ తో జతకట్టే ఛాన్స్ అందుకుంది. అనుష్క సోగ్గాడే.. ఊపిరిలో జస్ట్ గెస్ట్ రోల్స్ తో సరిపెట్టింది. తమన్నా ఊపిరితో మెప్పించిన, అభినేత్రి, ఒక్కడొచ్చాడు నిరాశ మిగిల్చాయి. యాంకర్లలో అనసూయ సోగ్గాడేలో ఓ చిన్నిరోల్ తో కవ్వించి, క్షణంలో మాత్రం పూర్తిస్థాయి నెగటివ్ రోల్ తో ఆకట్టుకుంది. రష్మీ గుంటూరు టాకీస్ లో పాట, ఎక్స్ పోజింగ్ తప్ప ఏ రకంగానూ అలరించలేదు. మొత్తానికి 2016 హీరోయిన్లకు కిచిడీ సంవత్సరంగానే మారింది. మరి వీరిలో మీరు ఎవరికి పట్టం కడతారో ఇక మీ ఇష్టం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more