శర్వాకు శతమానం భవతి అంటూ.. అగ్రహీరో ట్విట్.. King wishes 'Glory' for young hero

Nagarjuna tweets about shatamanam bhavati

Nagarjuna, Sharwanand, Tollywood legends, Mega Star Chiranjeevi, Natasimha Balakrishna, Shatamanam Bhawati, tollywood, cinema, Telugu cinema, entertainment

King Nagarjuna is known for his friendly nature in the film industry. Now, he wished young hero Sharwanand on the occasion of his new film Shatamanam Bhavati’s release.

శర్వాకు శతమానం భవతి అంటూ.. అగ్రహీరో ట్విట్..

Posted: 01/13/2017 04:53 PM IST
Nagarjuna tweets about shatamanam bhavati

సంక్రాంతి పర్యదినాన్ని పురస్కరించుకుని తెలుగు చలన చిత్ర రంగంతో ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో యువ హీరో.. మంచి కథలతో ముందుకు దూసుకెళ్తున్న శర్వానంద్ కూడా తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో.. ఆయనకు శతమానం భవతి అంటూ ఓ అగ్రహీరో నుంచి ట్విట్ వచ్చింది. ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ల్యాండ్ మార్క్ సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తన సినిమా శతమానంభవతిని రిలీజ్ చేస్తున్న శర్వానంద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోల సినిమాలతో పోటి పడటం సామాన్యమైన విషయం కాదు.

థియేటర్లు దొరకటమే కష్టమనుకునే సమయంలో గ్రాండ్గా రిలీజ్ అవుతున్న శర్వానంద్ సినిమా శతమానంభవతి, సక్సెస్ సాధించాలని శుభాకాంక్షలు తెలిజేశాడు కింగ్ నాగార్జున. ఇప్పటికే రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలకు కూడా తన శుభాకాంక్షలు తెలిపిన నాగ్, తాజాగా ఇంతటి భారీ కాంపిటీషన్లో శతమానం భవతి సినిమాను రిలీజ్ చేస్తున్న శర్వానంద్ ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. గత ఏడాది సొగ్గాడే చిన్ని నాయనా, డిక్టేటర్ సినిమాలతో పోటి పడ్డ శర్వానంద్ సక్సెస్ సాధించాడు. ఈ ఏడాది కూడా అదే ఫీట్ రిపీట్ చేయాలని ఆశిస్తున్నాని ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles