టాలీవుడ్ స్టార్ హీరో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిన జగపతి బాబు అప్పట్లో తన తండ్రి గురించి చేసిన కామెంట్లు బాగానే చర్చకు దారితీశాయి. తన తండ్రి ఓ ప్లే బాయ్ అని, ఆ అలవాట్లే తనకు అబ్బి ఇలా అయ్యానంటూ జగ్గూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఎంత తండ్రి అయినప్పటికీ, మరీ ఇంత ఓపెన్ గా ఓ లెజెండరీ మేకర్ గురించి కామెంట్లు చేయటం సరికాదని సీనియర్లు జగపతికి సూచించారు. ఆ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్(64) తన స్వీయ జీవిత చరిత్ర ఖుల్లాం ఖుల్లా: రిషికపూర్ అన్ సెన్సార్డ్ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించాడు.
ఈ పుస్తకంలో అతని వ్యక్తిగతమే కాదు, తన తండ్రి, బాలీవుడ్ సూపర్‌స్టార్ అయిన రాజ్‌కపూర్ గురించి ఎవరికీ తెలియని విషయాలను అందులో పేర్కొన్నారు. సినిమాలు, హీరోయిన్లు, మద్యం తాగడం.. ఇవే తన తండ్రి లోకమని, నర్గీస్, వైజయంతీమాల, తదితర హీరోయిన్లతో తన తండ్రికి సంబంధాలు ఉండేవని అందులో పేర్కొన్నారు. అలాగే తన చిన్ననాటి అనుభవాలు, తన కొచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాదు తన తండ్రిలా పిల్లలకు ఫ్రీడం ఇవ్వలేకపోతున్నానని తెగ ఫీలయ్యాడు. బాబీ సినిమాకు బెస్ట్ హీరోగా అవార్డును కొనుకోవటం దగ్గరి నుంచి, అది హిట్ అయ్యాకే తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని, అవే తనని ఇంత స్థాయికి చేర్చాయని పేర్కొన్నాడు.
అలాగే భారత మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను తాను దుబాయ్‌లో రెండుసార్లు కలిశానని, అతడితో కలిసి టీ కూడా తాగానని పేర్కొన్నాడు. తొలిసారి 1988లో దుబాయ్‌లో ఆశా భోంస్లే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తన వద్దకు దావూద్ మనిషి ఒకరు వచ్చి దావూద్ ఇంటికి తీసుకెళ్లాడని రిషి కపూర్ పేర్కొన్నారు. అక్కడ తనను దావూద్ సాదరంగా ఆహ్వానించాడని, తాను మద్యం తాగనని, అందుకే టీకి పిలిచానని దావూద్ తనతో చెప్పాడని రిషి పుస్తకంలో వివరించారు.
మరోసారి 1989లో దుబాయ్‌లోనే ఓ లెబనీస్ షాపులో బూట్లు కొనుక్కునేందుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న దావూద్‌తో మరోసారి కలిశానని వివరించాడు. ఆయన చేతిలో మొబైల్ ఫొన్, చుట్టూ పదిమంది బాడీగార్డులు ఉన్నారని పేర్కొన్నాడు. షాపులో తనకేం కావాలో తీసుకోమని చెప్పినా తాను తిరస్కరించానని రిషి తెలిపారు. భారత్‌లో ఎంతోమంది రాజకీయ నేతలు తన జేబులో ఉన్నారని, వారికి చాలా డబ్బు పంపించానని దావూద్ తనకు చెప్పాడని రిషికపూర్ తన జీవిత చరిత్రలో వివరించారు. ప్రముఖ రచయిత మీనా అయ్యర్ రచించిన అన్ సెన్సార్డ్ ట్యాగ్ లైన్ గల ఈ పుస్తకం మరిన్ని సంచనాలకు తావిస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more